చేద సమస్యకు చెక్ పెట్టడం చాలా ఈజీ.. ఈ 4 రెమిడీస్‌తో మాయం..

 వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇళ్లలో చెదపురుగుల సమస్య మొదలవుతుంది. ఈ చిన్న పురుగులు మొదట చెక్క ఫర్నిచర్ ను పాడు చేస్తాయి. ఆ తర్వాత గోడలు, ఇంటి పైకప్పు వరకు వ్యాపిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి రసాయనాలకు బదులుగా సహజమైన, సురక్షితమైన ఇంటి చిట్కాలు పాటించవచ్చు. ఇవి అన్ని రకాలుగా సేఫ్. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం

వర్షాకాలం వస్తే ఇళ్లలో చెదపురుగుల సమస్య పెరుగుతుంది. ఈ పురుగులు మొదట చెక్క తలుపులు, కిటికీలు, ఫర్నిచర్‌పై దాడి చేస్తాయి. తర్వాత ఇల్లు మొత్తం పాకి, గోడలు, పైకప్పుకు నష్టం కలిగిస్తాయి. ఈ సమస్యను నివారించడానికి రసాయన మందులు కాకుండా సహజమైన ఇంటి చిట్కాలు పాటించడం మంచిది.


చెదపురుగుల నివారణకు చిట్కాలు

వేప నూనె: వేప నూనె చెదపురుగులను తొలగించడానికి అత్యంత ప్రభావవంతమైన సహజ మార్గం. చెక్క ఫర్నిచర్, తలుపులపై వేప నూనెను రోజూ పూస్తే చెదపురుగులు పారిపోతాయి. వేప నూనెలోని ఘాటైన వాసన, ఔషధ గుణాలు వాటిని మళ్ళీ రాకుండా చేస్తాయి.

లవంగాల నూనె: లవంగాల నూనె కూడా చెదపురుగులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే క్రిమినాశక లక్షణాలు వాటికి హాని కలిగిస్తాయి. ఇది ఎక్కువ కాలం పనిచేస్తుంది.

పటిక నీరు, పసుపు: పటిక నీరు తయారుచేసి ప్రభావిత ప్రాంతాలపై చల్లండి. లేదా పసుపు పొడిని చల్లడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. ఈ సహజ పదార్థాలు ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి.

గాలి ప్రసరణ: వర్షాకాలంలో ఇంటిని ఎక్కువసేపు మూసి ఉంచడం వల్ల తేమ పేరుకుపోయి చెదపురుగులు వృద్ధి చెందుతాయి. అందుకే ఇంట్లో గాలి బాగా వచ్చేలా చూసుకోండి. ఫర్నిచర్‌ను గోడకు కొంచెం దూరంగా ఉంచండి. ఎండలో పెట్టడం మంచిది.

ముఖ్య గమనికలు:

చెదలు పట్టకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.

మురుగు కాలువలను తనిఖీ చేయండి. నీరు నిల్వ లేకుండా చూసుకోండి.

తడిగా, చీకటిగా ఉన్న ప్రదేశాలు చెదపురుగులకు అనుకూలమైనవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.