భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరిగా చేసింది ప్రభుత్వం. అందుకే పుట్టిన ప్రతి పిల్లవాడికి ఆధార్ తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
ఏడాది నుంచి ఐదు సంవత్సరాల లోపు బాల ఆధార్ ను కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత అప్డేట్ చేస్తున్నారు. పాఠశాలలో చేరడానికి కూడా ఆధార్ తప్పనిసరిగా మారడంతో దీనిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కానీ కొంతమంది దీనిపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఒరిజినల్ ఆధార్ కార్డును దగ్గరే ఉంచుకోవాలి. అయితే ఒక్కోసారి పేపర్ పై వచ్చే ఆధార్ కార్డు పాడైపోతూ ఉంటుంది. ఇదే సమయంలో PVC కార్డు ఉంటే శాశ్వత కాలంగా ఉండిపోతుంది. అయితే ఒకప్పుడు ప్రభుత్వం ఈ కార్డులను ఇంటింటికి పంపిణీ చేసేది. ఇప్పుడు ఈ కార్డును కావాలని అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఏటీఎం కార్డు వలె ప్రతి దానికి పివిసి కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా కార్డుల రూపంలో ఉండడంతో వీటిని జేబులో ఉంచుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా కార్డుల రూపంలో ఉంటే పాడైపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకే చాలామంది పీవీసీ కార్డులను తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇలాగే ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఆధార్ కార్డును కూడా పివిసి రూపంలో తీసుకోవాలి. మరి ప్రస్తుతం ఆధార్ కార్డు తీసుకుంటే పేపర్ రూపంలోనే ఇంటికి వస్తుంది. దీనిని పీవీసీ కార్డులో తీసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇందుకోసం బయట ఆధారంగా డబ్బులు వెచ్చిస్తారు. అయితే కేవలం రూ.50 తోనే ఒరిజినల్ పివిసి కార్డును పొందవచ్చు.
ఇందుకోసం www.myaadhar.uidai.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇందులోకి వెళ్ళిన తర్వాత పివిసి ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆధార్ కు లింకు అయినా ఫోన్ నెంబర్ను ఎంట్రీ చేయాలి. ఈ మొబైల్ నెంబర్ను ఎంట్రీ చేసిన తర్వాత ఓటిపి వస్తుంది. దీన్ని నమోదు చేయగానే 28 అంకెల డిజిట్ వస్తుంది. అంటే పివిసి కార్డు పంపించడానికి నమోదయిందని అర్థం. అయితే ఆన్లైన్లో అడ్రస్ ఎక్కడిది ఉంటే అక్కడికే ఈ పీవీసీ కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది. ఈ ప్రాసెస్ చేయడానికి రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. పీవీసీ కార్డు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది నేరుగా ఒరిజినల్ కార్డు అయినందున క్వాలిటీ కూడా ఉంటుంది.
చాలామంది పేపర్ ఆధార్ కార్డును పివిసి కోసం బయట షాపుల్లో అదనంగా డబ్బులు పెట్టి తీసుకుంటారు. ఇక్కడ ఒక్కో కార్డు రూ.100 వసూలు చేస్తున్నారు. అయితే ఆన్లైన్లో కేవలం రూ.50 కే పొందవచ్చు. ప్రతి అవసరానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా అవసరం ఉన్నందున.. దీనిని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆధార్ కార్డు వివరాలు ఎక్కడపడితే అక్కడ ఇవ్వకుండా ఉండాలి. ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని మెసేజ్ వస్తే వెంటనే సమీప మీసేవ సెంటర్లోకి వెళ్లి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి.
































