ట్రైన్ టికెట్‌పై వేరొకరు ప్రయాణిస్తే ఏం జరుగుతుంది?

ఒకసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత, కొన్ని కారణాల వల్ల మనం ఆ జర్నీ చేయలేకపోవచ్చు. అప్పుడు ఇంట్లో మరొకరు ఆ టికెట్‌ ఉపయోగించి ట్రైన్‌లో ప్రయాణించవచ్చా అని చాలామంది సందేహిస్తారు.


అయితే, ట్రైన్‌లో ఒకరి టికెట్‌తో మరొకరు వెళ్లొచ్చా? వెళ్తే ఏం జరుగుతుంది..? దీనికి సంబంధించి రైల్వే నియమాలు ఎలా ఉన్నాయి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రైల్వే నిబంధనలు

  • టికెట్‌పై పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ప్రయాణించాలి అని రైల్వే శాఖ కఠిన నియమాలు అమలు చేస్తుంది.
  • ఒకరి టికెట్‌లో మరొకరు ప్రయాణిస్తే, టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు.
  • రైల్వే చట్టం 1989 ప్రకారం, వేరొకరి టికెట్‌పై ప్రయాణిస్తే ఫైన్ లేదా జైలు శిక్ష విధిస్తారు. ట్రైన్ తరగతి, దూరం ఆధారంగా అలాగే నేరంగా పరిగణిస్తూ ఫైన్ వేస్తారు.
  • మీరు మీ రైలు టిక్కెట్‌ను కుటుంబ సభ్యులకు (తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు, భర్త, భార్య) పేరు మీద బదిలీ చేయాలనుకుంటే రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను సందర్శించి, అసలు టిక్కెట్, మీ గుర్తింపు కార్డు, సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. అయితే, మీరు వేరే వారికి టిక్కెట్‌ను బదిలీ చేయకుండా ఇస్తే, ఆ టిక్కెట్ క్యాన్సిల్ చేసినట్లుగా గుర్తిస్తారు.

ప్రయాణికులకు సూచనలు

  • మీ టికెట్‌ను ఇతరులకు అస్సలు ఇవ్వకండి.
  • అవసరమైతే టికెట్ క్యాన్సిల్ చేయండి లేదా రీషెడ్యూల్ కోసం రైల్వే అధికారులను సంప్రదించండి.
  • ఇలా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. లేదంటే, రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.

టీటీ, ఆర్పీఎఫ్‌ బాధ్యతలు

  • ట్రైన్‌లో ప్రతి వ్యక్తి వద్దా టికెట్ ఉందా అని టీటీఈ చెక్ చేస్తారు.
  • వేరొకరి పేరు ఉన్న టికెట్‌తో ప్రయాణించే వ్యక్తులను గుర్తించినప్పుడు జరిమానా వేస్తారు.
  • అవసరమైతే, చివరి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు, తదుపరి చర్యలకు సూచనలు అందిస్తారు.

కాబట్టి, వేరొకరి టికెట్‌పై ప్రయాణం చేయడం అనవసరమైన రిస్క్. సో మీ టికెట్‌ను ఇతరులకు ఇవ్వకుండా ఎమర్జెన్సీ పరిస్థితిలో క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేయడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.