తన ప్రతీ సినిమాతో తాను మాత్రమే ఎదగడం కాకుండా, తెలుగు సినిమా స్థాయి ని కూడా తనతో పాటు ఎదగనిస్తూ నేడు ఇండియా లో ఉన్న సూపర్ స్టార్స్ అందరికంటే పెద్ద స్థాయిలో ఉన్నాడు డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli).
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి మన టాలీవుడ్ ని తీసుకెళ్తే, #RRR తో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన టాలీవుడ్ ని తీసుకెళ్లాడు. ఇప్పుడు మహేష్ బాబు(Super Star Mahesh Babu) తో చేస్తున్న చిత్రాన్ని హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. గత కొంతకాలం క్రితమే షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూలు ప్రస్తుతం కెన్యా లోని నైరోబీ అడవుల్లో జరుగుతుంది. నిన్న ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవ్వడం, అందులో మహేష్ బాబు లుక్స్ ని చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడం వంటివి మనం చూశాము.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తుంది. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ టార్గెట్ అక్షరాలా 10 వేల కోట్ల రూపాయిలు అట. ఆ దిశగా రాజమౌళి ఇప్పటి నుండే ప్లానింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. డిస్నీ మరియు సోనీ పిక్చర్స్ వంటి టాప్ హాలీవుడ్ సంస్థలతో చేతులు కలిపి, ఈ చిత్రాన్ని ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయడానికి ఒప్పందం చేసుకున్నారట. దాదాపుగా 1 బిలియన్ జనాలను టార్గెట్ గా చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మన టాలీవుడ్ పీక్ రేంజ్ కి చివరి అంతస్తు అని చెప్పొచ్చు. రాజమౌళి ని చూసి ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ మరియు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలను కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.
2027 మార్చ్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘జెన్ 43’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. శ్రీరాముడి వంశానికి చెందిన 43 వ తరం వాడి లాగా ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడట. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో, మన ఇతిహాసాలను టచ్ చేస్తూ, అందరి అంచానాలు మించి ఈ చిత్రాన్ని తీర్చి దిద్దే ప్లాన్ లో ఉన్నాడు రాజమౌళి. ఇకపోతే ఈ సినిమాలో విలన్స్ గా ప్రియాంక చోప్రా మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి వారు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు నవంబర్ నెలలో కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ రాజమౌళి.
































