కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్. మీరు ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ అయ్యేందుకు ( Motorola Edge 50 Pro) ఇదే బెస్ట్ టైమ్.
ఆకర్షణీయమైన డిజైన్, స్పీడ్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన ఛార్జింగ్ తో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో అమెజాన్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు రూ. 11,800 కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ కేటగిరీలో అత్యంత ఆకర్షణీయమైన డీల్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డీల్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రూ.35,999 ప్రారంభ ధరను కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ఇప్పుడు రూ.25,669 వద్ద లిస్ట్ అయింది. ఇప్పటికి నేరుగా రూ.9,510 డిస్కౌంట్ అందిస్తోంది. ఈఎంఐ లావాదేవీలపై HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్‌లు అదనంగా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. తద్వారా మొత్తం ధర రూ.11,830కి తగ్గుతుంది. మీరు పాత ఫోన్ ఎక్స్చేంజ్ కోసం మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల 1.5K pOLED కర్వ్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. హుడ్ కింద, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. 4,500mAh యూనిట్ ద్వారా బ్యాటరీ లైఫ్, 125W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు అందిస్తుంది.
కేవలం నిమిషాల్లోనే మీ ఫోన్‌ను ఛార్జింగ్ చేయగలదు. కెమెరా ఫ్రంట్ సైడ్ 50MP OIS-ఎనేబుల్డ్ ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, మోటోరోలా 50MP ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కలిగి ఉంది.
































