ఓటీటీలోకి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు

టాలీవుడ్ స్టార్​ హీరో మంచు విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్​ ‘కన్నప్ప’ చిత్రం జూన్​ 27న విడుదలైంది. ఈ చిత్రం థియేటర్ల వద్ద హిట్​ టాక్​ ను సొంతం చేసుకుంది.


ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రుద్ర పాత్రపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ మూవీని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ భారీ స్థాయిలో తెరకెక్కించారు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, మోహన్ బాబు లాంటి స్టార్స్ ఈ మూవీలో నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఆగస్ట్ 4 నుంచి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో నటించిన చిత్రం కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మిక్స్ డ్ టాక్ తోనే ఇప్పటివరకు రూ. 600 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. సెప్టెంబర్ 11 న ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.

ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది సు ఫ్రమ్ సో మూవీ. రూ. 5 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 115 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రముఖ నటుడు రాజ్ బీ శేట్టియు ఇందులో ప్రధాన పాత్రలో కనిపించడమే కాకుండా, ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అలాగే జేపీ తుమినాద్ రచన, దర్శకత్వం చేశాడు. ఈ చిత్రం ఈ నెల 5 వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.