ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదట వినిపించిన పేరు బిల్ గేట్స్ అని చెప్పవచ్చు కానీ ఇప్పుడు మాత్రం అందరి నోట్లో నానుతున్న పేరు ఎలాన్ మస్క్ అని చెప్పవచ్చు.
టెస్లా అధినేతగా ప్రపంచానికి పరిచయమైన మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇంతకాలం బిలియనీర్ల గురించి మాత్రమే మనం విన్నాము. కానీ ఎలాన్ మస్క్ మాత్రం తొలి ట్రిలియనీర్ గా పేరు సంపాదించుకున్నారు. ట్రిలియన్ అంటే భారతీయ గణాంక పద్ధతిలో 1 లక్ష కోట్ల డాలర్లు అని అర్థం. దీన్ని భారతీయ కరెన్సీలో మార్చి చూస్తే రూ. 83 లక్షల కోట్లుగా చెప్పవచ్చు. అయితే అధికారికంగా టెస్లా బోర్డు ఎలాన్ మస్క్ కు ఈ భారీ పే ప్యాకేజీని ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ పే ప్యాకేజీలో మస్క్ కు అదనంగా 12 శాతం చొప్పున 423.7 మిలియన్ టెస్లా షేర్లు లభించనున్నాయి. ఆ ప్రతిపాదనను టెస్లా బోర్డు ఆమోదం తెలిపినట్లయితే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా ఎలాన్ మస్క్ చరిత్రలోకి ఎక్కనున్నారు.
ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద పే డీల్ అని చెబుతున్నారు. ఇప్పటివరకు ఏ కంపెనీ సీఈఓ కు కూడా ఈ స్థాయిలో కాంపెన్సేషన్ లభించలేదుజ అయితే మస్క్ ఈ ప్యాకేజీ పొందడానికి కంపెనీని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ విలువ 8.5 ట్రిలియన్ డాలర్లు దాటాలని లక్ష్యంగా కంపెనీ బోర్డు నిర్ణయించింది. అంతేకాదు ఏడాదికి 20 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీంతోె పాటు 10 లక్షల AI రోబోట్లు లేదా రోబోటాక్సీలు లాంచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంపెనీ వార్షిక లాభం 400 బిలియన్ డాలర్లు దాటాల్సి ఉంటుంది.
































