బ్రహ్మాస్త్రం.. వెల్లుల్లి – తేనె కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

రోగనిరోధక శక్తి : వెల్లుల్లి, తేనె రెండింటికీ యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రతి ఉదయం తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


ఫలితంగా జలుబు, గొంతు నొప్పి, తరచుగా వచ్చే జ్వరం వంటి సమస్యల నుండి రక్షణ లభిస్తుంది.

జీర్ణవ్యవస్థ – జలుబు : వెల్లుల్లి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తేనెలో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపు సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.ఈ మిశ్రమం ఒక సహజమైన కఫహరమైనదిగా పనిచేస్తుంది. ఇది శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. సైనస్‌లు, చెస్ట్ కంజెషన్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా తేనె గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది: ఆయుర్వేదంలో వెల్లుల్లిని గుండెకు ఎంతో మేలు చేసేదిగా భావిస్తారు. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ధమనులను శుభ్రంగా ఉంచుతుంది. రక్తాన్ని పలచుగా చేసి అడ్డంకులను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

శక్తిని అందిస్తుంది : తేనె తక్షణ శక్తిని అందిస్తుంది. వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరిచి శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ను అందిస్తుంది. రెండింటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. గోరువెచ్చని నీటితో తీసుకుంటే జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి: తాజా వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి శుభ్రం చేయండి. ఈ రెబ్బలను ఒక శుభ్రమైన గాజు కూజాలో వేయండి. వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా మునిగిపోయేలా తగినంత తేనెను పోయండి. కూజాను మూత పెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 7 నుండి 10 రోజులు ఉంచాలి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినవచ్చు. పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసకోకూడదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.