జీఎస్టీ ఉందా లేదా..? ఏ వస్తువుపై ఎంత ట్యాక్స్.. ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..

ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ రేట్లలో మార్పులు చేశారు. పలు వస్తువులపై జీఎస్టీ, VAT రేట్లు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం, savingswithgst.in వెబ్‌సైట్ ద్వారా లేదా QR కోడ్ ద్వారా ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ, VAT పడుతుందో తెలుసుకునేందుకు సులభమైన మార్గాన్ని అందిస్తోంది.

ఇటీవలె జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అయి.. జీఎస్టీని సవరించింది. పలు స్లాబులు తొలగించి, అనేక రకాలైన వస్తువులపై ట్యాన్స్‌ను తగ్గించింది. అయితే ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం విధించే VAT(వ్యాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌) ఎంత పడుతుందనేది సింపుల్‌గా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పట్లు చేసింది. అందుకోసం మై గౌట్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏ వస్తువుపై ఎంత జీఎస్టీ పడుతుందో తెలుసుకోవడానికి ఆ వస్తువును కార్ట్‌లోకి యాడ్‌ చేసి, వ్యూ కార్ట్‌పై క్లిక్‌ చేస్తే చాలు.. ఆ వస్తువు అసలు ధర, దానిపై వ్యాట్‌ ఎంత, జీఎస్టీ ఎంత అనేది తెలిసిపోతుంది.


గోధుమలపై ఎంత జీఎస్టీ పడుతుంది, టామాటా సాస్‌పై ఎంత జీఎస్టీ పడుతుందో కూడా సింపుల్‌గా ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం కింద ఇచ్చిన ట్వీట్‌లోని QR చేసినా తెలుసుకోవచ్చ లేదా savingswithgst.in ఈ లింక్‌పై క్లిక్‌ చేసి కూడా తెలుసుకోవచ్చు. దీని వల్ల జీఎస్టీ కొత్త రిఫామ్స్‌ వల్ల మీకు ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోవచ్చు అన్నమాట.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.