6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు

సెప్టెంబర్ 5, శుక్రవారం ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల తులం బంగారం రూ.1,10,030రూపాయలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,06,880గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,27,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం బంగారం ధర రూ.1,07,000గా ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. ఇక.. చెన్నై, ముంబై బెంగళూరు నగరాల్లో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. గత కొంత కాలంగా వడ్డీ రేట్లను భారీగా తగ్గించి సున్నా స్థాయికి చేర్చాలని ట్రంప్.. ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.