ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు గుడ్ స్యూస్

 ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పథకం అమలులో పారదర్శకతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులే స్వయంగా బేస్‌మెంట్ లెవెల్, వాలింగ్, స్లాబ్ లెవల్ ఫోటోను తీసుకుని ఆఫ్ లోడ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ( టీజీహెచ్ సీల్ యాప్ ) యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఎలా అప్లోడ్ చేయాలంటే.. మొదటగా మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత లబ్దిదారుడు లాగిన్ మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత డ్యాష్ బోర్డులో లబ్దిదారుడి పేరు, మొబైల్ నెంబరు తదితర వివరాలతో పాటు ఫొటోలు తీయడం (క్యాప్చర్ ఫోటోగ్రాఫ్) అనే వాటి కింద ఇళ్ల నిర్మాణపు దశలు (గ్రౌండింగ్, బేస్మెంట్, వాలింగ్ స్లాబ్, నిర్మాణం పూర్తి) అని కనిపిస్తాయి. లబ్దిదారులు గ్రౌ డింగ్ స్థాయి ఫొటోలు అప్‌లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్స్ క్లిక్ చేస్తే దరఖాస్తుదారునికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. లబ్దిదారులు ప్రతిపాదిత ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్‌లోని కెమెరాతో ఫొటోలు తీయాలి. అక్కడే కెమెరాతో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఒక్కసారి సరిచేసుకున్న తర్వాత సబ్‌మిట్ చేయాలి.

ఆ తర్వాత వెనక్కి వెళ్లి గ్రౌ డింగ్ బటన్‌పై క్లిక్ చేస్తే వివరాలన్ని కనిపిస్తాయి. బేస్‌మెంట్ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్దిదారుతో పాటు ముందువైపు నుంచి, పక్క నుంచి, పై నుంచి (టాప్ యాంగిల్) ఫోటోలు తీయాలి. ఈ ఫొటోలు గ్రౌ డింగ్ సమయంలో తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాలి. అనంతరం యాప్ లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి. ఇదే తరహాలో వాలింగ్ దశలోనూ, స్లాబ్ దశలోనూ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఫొటోలు తీసి లబ్దిదారులే నేరుగా బిల్లులు కోసం ఆఫ్ లోడ్ చేయవచ్చు. గ్రామ కార్యదర్శులు, ఎంపిడిఓలు, డీఈఈలు, పీడీ తదితర అధికారులు. ఈ విధంగా నమోదైన వివరాలను క్షేత్ర స్థాయిలో సరిచూసుకున్న తర్వాతనే లబ్దిదారులకు బిల్లులు విడుదల చేస్తారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు, పేమెంట్, ఇతర సమస్యల పై సందేహాలు నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబరు 18005995991 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందని గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జయదేవ్ ఆర్య తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.