సీసీఎస్ ఉద్యోగుల(CCS employees)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డీఏ బకాయిలు(DA Dues) విడుదల చేసింది. మొత్తం ఆరు విడతల్లో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తొలి విడతలో డీఏ బకాయి ఒక్కో ఉద్యోగికి రూ. 70 వేల వరకు అకౌంట్లలో జమ అయింది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. డీఏ బకాయి విడుదల కోసం ప్రభుత్వాలకు చాలా సార్లు విజ్ఞప్తి చేశాం. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని కానీ పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ డీఏ పెండింగ్ బకాయిలు విడుదల అవుతున్నాయని తెలిపారు.
































