ఎలుకల మందుతో పనిలేదు, అరటి పండు ఉంటే చాలు

ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు అశుభ్రంగా ఉంటే ఎలుకలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంట్లోకి ఒక్కసారి ఎలుకలు వచ్చాయంటే అవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.


అల్మారాలోకి ప్రవేశిస్తే బట్టల్ని కుడతాయి. అంతేకాకుండా కరెన్సీ నోట్లను కూడా కొరికే అవకాశం ఉంది. ఎలుకలు బయట నుంచి బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. దీంతో, అవి ఆహార పదార్థాలపై తిరిగితే.. రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలుకల్ని ఇంటి నుంచి వదిలించుకోవాలి. ఇంటి నుంచి ఎలుకల్ని తరిమికొట్టడానికి ఒక అరటిపండు చాలు. ఎలా వాడాలో తెలుసా?

ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే అవి చేసే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో ఆహార పదార్థాల్ని నాశనం చేస్తాయి. ఆహార పదార్థాలపై ఎలుకలు తిరగడం వల్ల వాటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఎంతో నష్టాన్ని కూడా ఇవి చేస్తాయి. బట్టల్ని కొరకడం, కరెన్సీ కాగితాల్ని డ్యామేజ్ చేయడం లాంటి పనులు కూడా చేస్తాయి. ఎలుకలు కొట్టడం అని మనం చాలా సార్లు విన్నాం. అంతేకాకుండా ఎలుక చచ్చిదంటే ఆ వాసనను తట్టుకోవడం కూడా కష్టం. అందుకే వాటిని ఇంటి నుంచి వదిలించుకోవాలి.

ఇంటి నుంచి ఎలుకల్ని వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్లో దొరికే రసాయనాలు, ఎలుకల మందు వాడుతుంటారు. అయితే, ఇంట్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వీటిని వాడటం రిస్క్‌తో కూడుకున్న పని. అయితే, మనం రోజూ తినే అరటిపండుతో ఇంట్లోకి ఎలుకలు రాకుండా ఆపేయొచ్చు. ఈ ట్రిక్‌ను యోగా ఎక్స్‌పర్ట్ కైలాష్ బిష్ణోయ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇంటి నుంచి ఎలుకల్ని తరిమికొట్టడానికి అరటిపండు ఎలా వాడాలో తెలుసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

* అరటిపండు – ఒకటి (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

* సిట్రిక్ యాసిడ్ పౌడర్ (ఇనో)

* పసుపు – ఒక టీ స్పూన్

* బేకింగ్ సోడా – ఒక టీ స్పూన్

ఎలుకల్ని తరిమికొట్టే చిట్కా

ఇంటి నుంచి ఎలుకల్ని తరిమికొట్టడానికి ముందుగా ఒక అరటిపండును తీసుకోండి. అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేటులోకి తీసుకోండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ సిట్రిక్ యాసిడ్ పౌడర్ వాటి మీద చల్లండి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా చల్లుకోండి. చివరగా ఒక టీ స్పూన్ పసుపు పొడిని చల్లుకోండి. ఆ తర్వాత ఈ అరటిముక్కల్ని ఇంటి మూలల్లో, బీరువాలు, ఎలుకలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉంచండి. సిట్రిక్ యాసిడ్ పౌడర్, బేకింగ్ సోడా, పసుపు పొడి ఎఫెక్ట్‌తో ఇంటి నుంచి ఎలుకలు పారిపోతాయి. ఎలుకలతో పాటు దోమలు, ఈగలు కూడా పారిపోతాయని యోగా గురువు చెబుతున్నారు.

ఎక్స్‌పర్ట్ చెప్పిన చిట్కా

అరటి తొక్కల్ని కూడా ఉపయోగించవచ్చు

​అరటి తొక్కలతో కూడా ఎలుకల్ని తరిమికొట్టవచ్చు. ఇందుకోసం మీకు అరటి తొక్కలు, బేకింగ్ సోడా, సిట్రిక్ యాసిడ్ పౌడర్, గోధుమ పిండి ఉంటే చాలు. ఇందుకోసం ముందుగా అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా కోయాలి. అరటితొక్కల్ని పేస్టులా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో సిట్రిక్ యాసిడ్ పౌడర్ లేదా ఒక చెంచా బేకింగ్ సోడాను బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఆ తర్వాత గోధుమపిండి తీసుకుని నీటితో కలుపుకుని ఉండలు చేసుకోండి. ఈ ఉండల్లో అరటితొక్కల మిశ్రమాన్ని ఉంచండి.

ఎలా ఉపయోగించాలి?

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న చిన్న బంతులుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంతుల్ని ఇంటి మూలలు లేదా ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచండి. ఎలుకలు ఈ ఉండల్ని తినగానే వాటి కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. దీంతో, అవి ఇంటి నుంచి పారిపోతాయి. ఈ ట్రిక్ చాలు సులభమైంది. ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదని నిపుణులు అంటున్నారు.

పటికతో ఎలుకలు పరార్

పటికని ఉపయోగించి ఇంటి నుంచి ఎలుకల్ని తరిమికొట్టవచ్చు. ఇందుకోసం పటికను కాస్తా తీసుకోండి. దీంతో.. ఎలుకల్ని తరిమికొట్టే స్ప్రే సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకోసం పటికను నీటిలో బాగా కలుపుకోవాలి. తయారుచేసిన మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపండి. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, ఇంటి మూలల్లో, అటక మీద ఈ స్ప్రేను పిచికారీ చేయండి. ఎలుకలు పటిక వాసన కారణంగా ఇంటి నుంచి పారిపోతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.