ఇదిగో మోడీ గోల్డ్ .. తులం బంగారం ధర 37 వేల రూపాయలే.. అసలు నమ్మకం కుదరటం లేదా.. బంగారం కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం అసాధారణ అవకాశం అందించింది.
తులం (10 గ్రాములు) బంగారాన్ని కేవలం 37 వేల రూపాయలకే, అంతేకాకుండా హాల్‌మార్క్‌తో అందిస్తోంది. ఇంత తక్కువ ధరకు బంగారం ఎలా లభిస్తుందని అనుమానం వేస్తున్నారా? దాని వెనుక ఉన్న వివరాలు తెలుసుకోండి.
మోడీ గోల్డ్ అంటే ఏమిటి?
భారతీయ మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ. ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని కలలు కంటారు, కానీ ధరలు ఆకాశాన్ని తాకడంతో ఆ కలలు దూరమవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ హాల్‌మార్క్ బంగారాన్ని 10 గ్రాములకు 37 వేల రూపాయలకే అందిస్తోంది. దీన్నే ‘మోడీ గోల్డ్’గా పిలుస్తున్నారు.
తక్కువ ధరకు బంగారం ఎలా?
సాధారణంగా 10 గ్రాముల స్వచ్ఛమైన (24 క్యారెట్) బంగారం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. బంగారం వివిధ క్యారెట్లలో (9, 14, 18, 22, 24) లభిస్తుంది, మరియు ధర క్యారెట్ ప్యూరిటీపై ఆధారపడి ఉంటుంది. హాల్‌మార్క్ ఉన్న బంగారమే నిజమైనది మరియు నమ్మదగినది. 9 క్యారెట్ బంగారం (37.5% ప్యూర్) ధర చాలా తక్కువగా ఉంటుంది, ఇది 24 క్యారెట్‌తో పోలిస్తే బజెట్-ఫ్రెండ్లీ.
హాల్‌మార్క్ ఎందుకు తప్పనిసరి?
ఇక్కడి వరకు 9 క్యారెట్ బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ లేదు, దీంతో మోసాలు జరగడం పెరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలను సవరించి, 9 క్యారెట్ నుంచి 24 క్యారెట్ వరకు అన్ని బంగారు నగలకు హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది. ఇది 2025 జులై నుంచి అమలులో ఉంది.
ప్రభుత్వం ఈ చర్య ఎందుకు తీసుకుంది?
బంగారం ధరలు పెరగడంతో పాటు మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం కొనుగోలుదారులలో విశ్వాసాన్ని పెంచడానికి, తక్కువ ధరకు ఆభరణాలను అందించడానికి ఈ చర్యలు తీసుకుంది. 24 క్యారెట్ బంగారం కొనలేని వారు 9 క్యారెట్‌ను ఎంచుకోవచ్చు, ఇది 10 గ్రాములకు 37 వేల రూపాయలకే లభిస్తుంది – 24 క్యారెట్ (సుమారు 98 వేల రూపాయలు)తో పోల్చితే చాలా చౌక.
హాల్‌మార్క్‌ను ఎలా చెక్ చేయాలి?
బంగారం కొనుగోలు ముందు హాల్‌మార్క్‌ను తప్పకుండా పరిశీలించండి. హాల్‌మార్క్ ఉంటే అది స్వచ్ఛమైనది. ప్రతి ఆభరణంపై BIS లోగో, ప్యూరిటీ మార్క్ (ఉదా: 375 for 9K) ఉండాలి. ప్రతి జ్యువెలరీకి ఒక్కో కోడ్ ఉంటుంది. ప్రతి ఆభరణానికి 6 అంకెల హాల్‌మార్క్ ID ఉంటుంది. BIS యాప్ డౌన్లోడ్ చేసి, ఆ IDని స్కాన్ చేసి ఆభరణ వివరాలు, అసలు అని తనిఖీ చేయవచ్చు. ఇలా చేస్తే మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది.
ప్రతి ఒక్కరికి బంగారం కొనాలని ఆశ ఉంటుంది. కానీ పెరిగిన బంగారం ధరలు కారణంగా సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన 9 క్యారెట్ gold ని ఎంచుకోవచ్చు. కాబట్టి 9 క్యారెట్ gold మీద ఒక లుక్ వేయవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.
































