కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఒక కోటికి మంది పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే దాదాపు 9 నెలల పాటు సమయం గడిచిపోయింది. ఇంకా ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు జరగలేదు ముఖ్యంగా ఎనిమిదో పే కమిషన్కు సంబంధించిన చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది అని చెప్పవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతోంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిజానికి ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఏ పెంపుదల చేస్తారు ప్రస్తుతం ఏడవ పే కమిషన్ సంబంధించి చివరి డిఏ పెంపుదల జరగాల్సి ఉంది. ఏడవ పే కమిషన్ సంబంధించి ఏడాది ఏప్రిల్ నెలలో డిఏ పెంపుదల చేశారు. ఈ పెంపుదల రెండు శాతానికి పరిమితం అయింది. అయితే నిజానికి నాలుగు శాతం వరకు పెంపుదల జరుగుతుందని అంతా భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రెండు శాతం మాత్రమే పెంపుదలకు అనుమతించింది. అయితే ఈసారి దసరాకు మాత్రం పెంపుదల పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సారి డీఏ (Dearness Allowance) పెంపుదల కేంద్ర ప్రభుత్వం దసరా సందర్భంగా కీలక అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ పెంపుదల అనేది జరుగుతుంది. . ఇది ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రకటిస్తారు. అయితే ఈ పెంపుదల వల్ల ఉద్యోగులు పెన్షనర్లకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయి. దసరా పండగ వేళ ఈ కొత్త డిఏ అమలు చేస్తారని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండుసార్లు డీఏ పెంపుదలకు సిఫార్సు చేస్తుంది. అయితే ఇది కేవలం గతంలో కేవలం రెండు శాతానికి మాత్రమే పరిమితం అయింది కానీ ఈసారి 3 నుంచి నాలుగు శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే పెండింగ్ బకాయిల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నేనేమి తీసుకున్న అవకాశం ఉందని కూడా ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. కరోనా సందర్భంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన పలు పెండింగ్ బకాయిలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
































