బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక కాళ్ల నొప్పులా? అయితే ఈ చిట్కాలు పాటించండి

రక్త ప్రసరణ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలను చేరవేసేది రక్త ప్రసరణ వ్యవస్థే.


రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకులు ఏర్పడితే లేదా కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెకు రక్తం సరఫరా సరిగా జరగదు. దీనివల్ల శరీరంలోని వివిధ భాగాలలో, ముఖ్యంగా కాళ్ళలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలాంటి సమస్యలకు ఇంట్లోనే పరిష్కారాలు ఉన్నాయి.

రక్త ప్రసరణను మెరుగుపరచడానికి చిట్కాలు!

1. నడకను అలవాటు చేసుకోండి!

నేటి యువత ఎక్కువగా నడవడానికి ఇష్టపడరు. ఇది సిగరెట్ తాగడం లాగే చాలా ప్రమాదకరమైనది. అందుకే ప్రతి 30 నుండి 40 నిమిషాలకు ఒకసారి లేచి కాసేపు నడవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

2. శరీరంలో నీటి శాతం ఉండాలి!

డీహైడ్రేషన్‌ను నివారించండి. తగినంత నీరు తాగకపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా ఉండదు. మంచి రక్త ప్రసరణ కోసం మీరు సరైన మోతాదులో నీరు తాగాలి. కనీసం రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం.

3. మంచి ఆహారం తీసుకోండి!

మీ ఆహారంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే పదార్థాలను చేర్చుకోండి. బీట్‌రూట్, ఆకుకూరలు, నిమ్మజాతి పండ్లు, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ వంటివి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి రక్తనాళాలను విశ్రాంతి పరుస్తాయి.

4. వ్యాయామం చేయండి!

కొన్ని రకాల వ్యాయామాలు రక్త ప్రసరణను బాగా మెరుగుపరుస్తాయి. పిక్కల కండరాల నుంచి రక్తం నేరుగా గుండెకు సరఫరా అవుతుంది. అందుకే కాళ్ల వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నడక, జాగింగ్, సైక్లింగ్ వంటివి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.