రోజుకు రెండు పెగ్గుల మద్యం తాగితే మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారు

ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరు ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరు రోజూ తాగుతూనే ఉంటారు. ఇలా డేలీ ఆల్కహాల్ తీసుకునే వారిలో కొందరు తెలివిగా రోజూ కొంత మోతాదులో(ఒకటి లేదా రెండు పెగ్గులు) మద్యం తీసుకుంటే మంచిదేనని వారిస్తుంటారు. ఈ అంశంపై వైద్యులు ఏం చెబుతున్నారు? నిజంగా రోజుకు రెండు పెగ్గులు మద్యం తాగితే మంచిదేనా? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్ ఎక్కువ లేదా తక్కువ తాగినా దాని వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు అంటున్నారు. మీరు కొద్దిగా మద్యం తాగినా అది మీ గుండెను బలహీనపరుస్తుందని వెల్లడించారు. ఇది రక్తపోటును పెంచుతుంది. ఫ్యాటీ లివర్ కు కారణమవుతుంది. లివర్ సిర్రోసిస్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఒక్కసారి మద్యానికి బానిసైతే మానసిక ఆందోళనలు, ఒత్తిడి , డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అతిగా తాగేవారికి శరీరం, మెదడుపై అదుపు తప్పుతుంది. మందు బాబులే ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లకు కారణమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

వాస్తవానికి.. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు దానిలోని ఇథనాల్ ఆహార నాళంలోకి వేగంగా చేరుతుంది. తరువాత కాలేయానికి చేరుకుంటుంది. ఆల్కహాల్ డీహైడ్రోజినీస్ (ఏడీహెచ్) అనే ఎంజైమ్‌ల ద్వారా జీవక్రియలను నిర్వహించడంలో కాలేయం కీలకమైంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎంజైమ్ యాక్టివిటీ పెరిగి కాలేయం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ఇథనాల్ జీవక్రియలు అధికం కావడం వల్ల కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. వీటివల్ల పొట్టలో మంట ఏర్పడవచ్చు. అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డెవలప్ కావడానికి దారితీస్తుంది. ఇది మరింత తీవ్రమైతే ఆల్కహాలిక్ హెపటైటిస్ లేదా సిర్రోసిస్‌కు కారణమవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.