ట్రాఫిక్ చలాన్‌ నుంచి తప్పించుకోవాలా? ఈ ఒక్క యాప్ఇ న్‌స్టాల్ చేసుకోండి..

టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు పోలీసులు వాహనాలను ఆపి చలాన్లు రాసేవారు. తరువాత కెమెరాలు వచ్చాయి. నగరాల్లోని కూడళ్లలో పోలీసులు కెమెరాల ద్వారా ఫొటోలు తీసి ఆన్లైన్‌లో చలానాలు విధిస్తున్నారు.


పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాటిని రహస్య ప్రాంతాల్లో పెట్టడం, వాహనదారుడు గమనించకపోవడం వల్ల చలాన్ పడుతుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఓ మార్గం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ కెమెరాలు లేదా పోలీసుల ట్రాప్‌ల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఈ సమాచారాన్ని ఒక యాప్ అందిస్తుంది. మీరు డ్రైవింగ్ చేసే టప్పుడు దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే చాలు ఎక్కడ కెమెరాలు ఉన్నాయని ఈజీగా కనిపెట్టిన మీకు ఇన్ఫర్మెషన్ ఇస్తుంది. ఆ యాప్ పేరు ఏంటి? అది ఎలా పని చేస్తుందో పూర్తిగా తెలుసుకుందాం..

ఈ యాప్‌ పేరు వేజ్(Waze). ఇది మ్యాప్‌లు, ట్రాఫిక్, స్పీడ్ కెమెరా లొకేషన్‌లను అందించే నావిగేషన్ యాప్. ఈ యాప్ గూగుల్, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. మార్గంలో ట్రాఫిక్, రోడ్ బ్లాక్‌లు, స్పీడ్ కెమెరాల గురించి వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్లు అందుతాయి. ఈ యాప్ పూర్తిగా ఉచితం. లక్షలాది మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌లు చలాన్‌ను నివారించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ వాటి ఉద్దేశ్యం నియమాలను ఉల్లంఘించడం కాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి, ప్రజలు నియమాలను పాటించడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతున్నాయి. అందువల్ల మనం సాంకేతికతను భద్రత, అప్రమత్తత కోసం ఉపయోగించడం ముఖ్యం. కేవలం చలాన్‌ను నివారించడానికి కాదని ప్రతి వాహనదారుడు గమనించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.