విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

విద్యార్థులు మరో బిగ్ అలర్ట్. పలువురి డిమాండ్ల మేరకు దసరా (Dasara) పండుగ సందర్భంగా ఇచ్చిన సెలవుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.


వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో దసరా సెలవుల్లో మార్పులు చేయాలని తాజాగా చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్సీ గోపికృష్ణ విజ్ఞప్తి చేశారు. అయితే, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. కానీ, విజయదశమి ఉత్సవాలు 22 నుంచి మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ తేదీ నుంచే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఎమ్మెల్సీ గోపీకృష్ణ (MLC Gopi Krishna) సర్కార్‌కు విజ్ఞప్తి చేవారు. అదేవిధంగా డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా, స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను కూడా చేపట్టాలని కోరారు. మరోవైపు పొరుగు రాష్ట్రం తెలంగాణలో అక్కడి ప్రభుత్వం ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.