ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూ్లన కోసం పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీ4 కార్యక్రమంలో భాగంగా సంపన్న వర్గాలు..
పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. దత్తత తీసుకునే సంపన్న వర్గాలను మార్గదర్శులుగా, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం నామకరణం చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో చంద్రబాబు ఓసారి ముఖాముఖి కూడా నిర్వహించారు.

మరోవైపు ప్రభుత్వ నిర్ణయం మీద సచివాలయ ఉద్యోగులలో కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించేవారు. అయితే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేకుండా పోయింది. అయితే ఇప్పుడు క్లస్టర్ల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉండటంతో కొంతమంది నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వాలంటీర్లు ఒక్కొక్కరికీ అప్పట్లో 50 ఇళ్ల బాధ్యతలు కేటాయించారు.
ఇప్పటి ప్రభుత్వం వాటిని క్లస్టర్లుగా విభజించి ఒక్కొక్క ఉద్యోగికి మూడు క్లస్టర్ల బాధ్యతలు అప్పగిస్తోందని.. వాలంటీర్ల పనులను కూడా తమతోనే చేయిస్తోందని కొంతమంది సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వర్క్ ఫ్రమ్ హోం సర్వే, పీ4, వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం వంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉండటంపై వారు అభ్యంతరం తెలుపుతున్నారు.