‘రీల్స్’ ఎక్కువగా చూసే అలవాటు ఉందా..? 20-20-20 రూల్ గురించి తెలుసా..?

న్నం తినకుండా ఉంటారేమో కానీ సెల్ ఫోన్ లేకుండా మాత్రం క్షణమైనా ఉండలేని పరిస్థితిలో ప్రస్తుతం యువత ఉన్నారు. ఉదయం లేచింది మొదలు.. అర్ధరాత్రి పోయే వరకూ చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే.


మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా కొందరు భావిస్తుంటారు మరికొందరు. సోషల్ మీడియా ప్రభావం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే అదేపనిగా రీల్స్ ఎక్కువగా చూస్తే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రీల్స్​ , షాట్స్ ​, వీడియోలను గంటల తరబడి చూస్తుంటే ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.

కొన్నేళ్ల క్రితం గేమ్స్ అంటే గ్రౌండ్ లోనే ఆడుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ కు అలవాటు పడిపోయారు పిల్లలు. మొబైల్ ఫోన్ లోనే అన్ని గేమ్స్ ఆడుతున్నారు. రీల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అదే పనిగా ఇన్​ స్టా గ్రామ్, ఫేస్​ బుక్, యూట్యూబ్​ లో రీల్స్, షాట్స్ వీడియోలను చూస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక స్క్రీన్ టైం కారణంగా కంటిపై డిజిటల్ ఒత్తిడి పడుతుందని తద్వారా అది కంటి చూపును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. గంటల తరబడి రీల్స్ చూస్తూ ఉంటే పిల్లల్లో కళ్లు పొడిబారిపోవటం, హాస్వ దృష్టి పెరగటం, కళ్లు ఒత్తిడికి గురికావడం లాంటి ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. అంతేకాక పిల్లలకు చిన్న వయస్సులోనే మెల్లకన్ను రావటం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.

అలాగే రోజూ గంటల తరబడి మొబైల్ స్క్రీన్ ​కు అతుక్కుపోయే పిల్లల్లో మయోపియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక పెద్దవారిలో కూడా సెల్ ఫోన్ లోని బ్లూ లైట్ కారణంగా తరచూ తలనొప్పి, మైగ్రేన్, నిద్రలేమి వంటి సమస్యల బారిన పడుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాక కళ్లు మంట, దురద, తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అంతేకాక పిల్లలు గంటల తరబడి రీల్స్ చూస్తూ ఉండటం కారణంగా వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించటం, కుటుంబ సంబంధాలు దెబ్బతినటం, చదువు, చేసే పనిపై దృష్టి తగ్గటం లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని నిపుణులు స్పష్టం చేశారు.

అయితే ఇలా గంటల తరబడి రీల్స్ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ఓ నూతన విధానాన్ని నిపుణులు తీసుకొచ్చారు. అదే 20-20-20 ఫార్ములా .. అంటే ప్రతి 20 నిమిషాల ఒకసారి 20 సెకన్లు విరామం తీసుకోవాలి. ఆ టైంలో 20 మీటర్లు దూరంలో వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి లేదా గంటకు ఐదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలని చెబుతున్నారు. అలాగే అదే పనిగా ఫోన్ చూడకూడదని, మధ్య మధ్యలో కనురెప్పల్ని ఆర్పుతూ ఉండాలని నిపుణులు స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.