ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ తో స్వచ్చమైన పాలు, నకిలీ పాల మధ్య తేడా గుర్తించండి

భారత దేశంలో ఎక్కువ మంది పాడి పంటల మీద ఆధారపడి జీవిస్తారు. లక్షలాది మంది రైతులు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు పాల ద్వారా జీవనోపాధిని పొందుతారు. అయితే ప్రస్తుతం మన దేశంలో అమ్మే పాలల్లో దాదాపు 70% కల్తీ అని ఒక నివేదిక పేర్కొంది. ఆరోగ్యానికి హానిని కలిగించే అనేక కాలుష్య కారకాలను కలిగి ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో ఇంట్లో ఉపయోగించే స్వచ్చమైన పాలు, నకిలీ పాలను గుర్తించడం ఎలాగో తెలుసుకుందాం..

భారతదేశంలో పాలును, పాల ఉత్పత్తులను అధికంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా పండుగల సమయంలో పాలకు, మావా (ఖోవా) కి డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. దీపావళి అయినా, దుర్గా పూజ అయినా ప్రతి ఇంట్లో స్వీట్లు, రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. అయితే ఈ సమయంలో పాలల్లో కల్తీ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉండటం వల్ల పాల స్వచ్ఛతపై అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. స్వచ్చమైన పాలు, నకిలీ పాల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.


ఈ రోజుల్లో మార్కెట్ లో దొరికే ఆహార పదార్ధాలలో ఎక్కువగా కల్తీవే అని తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలు మార్కెట్లో అత్యంత కల్తీ ఆహార పదార్థంగా పరిగణించబడుతున్నాయి. పాలలో నీటిని జోడించి పాలను అమ్మడం నుంచి పిండి, రసాయనాలను ఉపయోగించి తయారు చేసే పాలు కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి. స్వచ్చమైన పాలకు, నకిలీ పాలకు తేడా తెలియదు. దీంతో వీటిని ఉపయోగించడం వలన ఆరోగ్యానికి హానికరం.

పాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి యంత్రం, వంటింటి చిట్కాలు రెండూ ప్రభావంటంగా పనిచేస్తాయి. పాల వ్యాపారంతో సంబంధం ఉన్న నిపుణులు పాలను ఫాటోమీటర్ యంత్రంతో పరీక్షించవచ్చని చెబుతున్నారు. ఈ యంత్రం ఖరీదైనది (సుమారు 50-60 వేల రూపాయలు). అయితే ఇది పాలలోని కొవ్వు, SNF, ప్రోటీన్, వెన్న కంటెంట్‌ను కేవలం 25-30 సెకన్లలోనే చెబుతుంది.

ఉదాహరణకు గేదె పాలలో కొవ్వు 6 నుంచి 8.5 శాతం మధ్య ఉండాలి. కొవ్వు SNF సమతుల్యత సరిగ్గా ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవిగా పరిగణించబడతాయి. మరోవైపు ఒక లీటరు పాలలో 200 గ్రాముల కంటే తక్కువ వెన్న వస్తే..ఆ పాలు కల్తీ అని అర్థం చేసుకోవాలి.

ఇంట్లోనే పాల స్వచ్ఛతను తనిఖీ చేయడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక లీటరు పాల నుంచి 200 నుండి 320 గ్రాముల మావా (ఖోవా) పొందాలి. దీని కంటే తక్కువ మావా (ఖోవా) వస్తే పాలు ఖచ్చితంగా కల్తీ అవుతాయి. దీనికి తోడు మరిగే పాలపై చిక్కటి క్రీమ్ ఏర్పడుతుంది. ఈ క్రీమ్ సన్నగా ఉన్నా లేదా అస్సలు ఏర్పడకపోయినా పాలలో నీరు ఎక్కువగా కలిపారని అర్థం చేసుకోండి.

స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు పాలు పాత్రకు లేదా రేకుకు అంటుకుంటుంది. అయితే నకిలీ పాలు అలా చేయవు. నిజమైన పాల రుచి తియ్యగా, సహజంగా ఉంటుంది. అయితే కల్తీ పాల రుచి చప్పగా, రుచిలేనిదిగా ఉంటుంది.

నకిలీ పాలను గుర్తించడానికి దీని రంగు, రుచిపై శ్రద్ధ చూపడం ముఖ్యం. స్వచ్ఛమైన పాలు ప్రకాశవంతమైన తెల్లగా ఉంటాయి. అయితే నకిలీ పాలు లేత పసుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి. నిజమైన పాలు నెమ్మదిగా చెడిపోతాయి. అయితే నకిలీ పాలు కాచి తోడు పెట్టినప్పుడు త్వరగా పెరుగుగా మారతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.