ఏంటి ఎండిన నిమ్మకాయలతో ఇన్ని ప్రయోజనాలా?.. తెలిస్తే వాటిని అస్సలూ పడేయరు

సాధారణంగా వంటగదిలో నిల్వ చేసిన కూరగాయలు, పండ్లు ఎండిపోయితే వాటిని చాలా మంది చెత్తబుట్టలో పడేస్తారు. కానీ కొన్ని ఎండిన పండ్లు, కూరగాయాల వల్ల కూడా అనే ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో నిమ్మకాయ ఒకటి. చాలా మంది ఎండిపోయిన నిమ్మకాయలు పనికిరావని వాటిని పాడేస్తుంటారు. కానీ వాటిని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించ వచ్చని చాలా మందికి తెలియదు. నిమ్మకాయలు ఆహార రుచిని పెంచడమే కాకుండా, అందం సంరక్షణ, ఇంటిని శుభ్రపరచడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ ఎండిన నిమ్మకాయలను పారవేయకుండా ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఎండిన నిమ్మకాయలను పాడేయకుండా వాటని సహజ ఎయిర్ ఫ్రెషనర్‌గా మనం ఉపయోగించవచ్చు. దీని కోసం, ఎండిన నిమ్మకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి గదిలోని ఏదైనా మూలలో ఉంచండి. నిమ్మకాయల నుంచి వచ్చే సూక్ష్మమైన పుల్లని వాసన గదిలోని దుర్వాసనను తొలగిస్తుంది. అలాగే వాతావరణాన్ని తాజాగా, ఆహ్లాదకరంగా చేస్తుంది.


అలాగే ఎండిన నిమ్మకాయాలను వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎలా అంటే నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది వంటగదిలోని గ్రీజు, జిడ్డు వంటి మరకలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎండిన నిమ్మకాయలు, బేకింగ్ సోడాతో కలిపి సహజ క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు.

ఈ రెండింతో తయారు చేసిన మిశ్రమాన్ని ఉపయోగించి, మీరు గ్యాస్ స్టవ్‌లు, సింక్‌లు, టైల్స్‌పై ఉన్న మొండి మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ పద్ధతి ఖరీదైన రసాయన క్లీనర్ల అవసరాన్ని తగ్గిస్తుంది. అలాగే పర్యావరణానికి కూడా చాలా మంచిది.

చర్మ సౌందర్యం కోసం కూడా ఎండిన నిమ్మకాయలను ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు ఇంట్లో సులభంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఎండిన నిమ్మకాయలను ఎండబెట్టి, ముల్తానీ మిట్టితో కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంపై ఉన్న టాన్‌ను తొలగిస్తుంది. అలాగే ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఎప్పుడూ తాజాగా ఉంచుతుంది.

ఈ విధంగా, ఎండిన నిమ్మకాయలను పారవేయాల్సిన అవసరం లేకుండా రోజువారీ అవసరాలకు ఉపయోగించవచ్చు. నిమ్మకాయల సహజ లక్షణాలను ఈ విధంగా ఉపయోగించడం వల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.