చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది లిటిల్ హార్ట్స్ మూవీ. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.
కేవలం రూ. 2.5 కోట్లతో 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా గురించి కేవలం సాధారణ ఆడియన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. లీడ్ రోల్ లో నటించిన మౌళి నుంచి డైరెక్టర్ సాయి మార్తాండ్ వరకూ ఈ మూవీకోసం పడిన కష్టం స్క్రీన్ పై కనబడుతోంది.
మౌళి తనుజ్ యూట్యూబ్ తో ఫేమస్ అయి 90 స్ బయోపిక్ తో హీరోగా తెరంగేట్రం చేసాడు. మౌళి తన నటనతో మెప్పించాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఫుల్ ఫన్ రైడ్ గా సాగుతుంది. రెండు గంటలపాటు నాన్ స్టాప్ నవ్వులే అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ మూవీలో మౌళి తనుజ్ తోపాటు, శివాని నాగరం, రాజీవ్ కనకాల, కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ మూవీలో నటించిన మరో యంగ్ యాక్టర్ జై కృష్ణ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో జై కృష్ణ ఉప్పెన సినిమాలో మెరిశాడు. హీరో వైష్ణవ్ తేజ్ పక్కన ఫ్రెండ్ గా మెప్పించాడు. ఇప్పుడు మౌళి పక్కన ఫ్రెండ్ గా జై కృష్ణ పంచ్ లకు థియేటర్లలో పగలబడి నవ్వుతున్నారు. జై కృష్ణ స్టీల్ ది షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మౌళితో సమానంగా స్క్రీన్ ను షేర్ చేసుకున్నాడు. ఆన్ స్క్రీన్ లో వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమాలో మౌళి, జై కృష్ణ కాంబో చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది.
అయితే జై కృష్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటి అంటే జై కృష్ణ.. టాలీవుడ్ లెజెండరీ కమిడియన్ రాజాబాబు ముని మనవడని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా చెప్పలేదు. జై కృష్ణ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఈ వార్త నిజమా కాదా అని తెలియాల్సి ఉంది. నెటిజెన్లు మాత్రం రాజబాబు కామెడీ టైమింగ్ జై కృష్ణకు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
































