జలాశయంలోకి లారీ వెళ్తున్నట్టు ఉంది కదూ! సాధారణంగా నదులు, కాల్వలు కింద పారుతుంటే వాటిపైన రహదారి కోసం వంతెనలు నిర్మిస్తుంటారు. కానీ, ఇక్కడ దానికి రివర్స్..
కింద రోడ్డు ఉంటే పైన కాల్వ కోసం అక్విడక్టు నిర్మించారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉందీ కట్టడం. నాగార్జునసాగర్ కుడి కాలువ నిర్మించేటప్పుడు మాచర్ల సమీపంలో చంద్రవంక వాగుతో పాటు రోడ్డు అడ్డుగా వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారంగా అక్విడక్టు నిర్మించాలని భావించి.. ఆ బాధ్యతలను ముంబయికి చెందిన ఓ కంపెనీకి అప్పగించారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. అప్పటినుంచి స్థానికులు దీనిని ‘బొంబాయ్ బ్రిడ్జి’ అనే పిలుచుకుంటున్నారు. ఇది 180 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో ఉంది.
































