కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిందిగా.. ఎక్కడ చూడాలంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం “కూలీ”. భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న రిలీజ్ అయ్యింది.


టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. లోకేష్ కనగారాజ్ యూనివర్స్ లో గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా “కూలీ” మాత్రం ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేసింది.

థియేటర్స్ లో రిలీజ్ అయి రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తమిళనాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది కూలీ. కానీ తెలుగు, కన్నడ, మలయాళంతో పటు ఓవర్సీస్ లోను బయ్యర్స్ కు కాస్త నష్టాలు మిగిల్చింది కూలీ. కాగా ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా రైట్స్ ను రిలీజ్ కు ముందుగానే పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 11న అనగా నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ చేసింది అమెజాన్ ప్రైమ్. థియేటర్స్ లో రిలీజ్ అయిన 28 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ అయింది కావలి. థియేటర్స్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూలీ ఓటీటీలో ఎలాంటి స్పందన రాబడుతుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.