శ్రీవారి పింక్ డైమండ్ పై వెలుగులోకి సంచలన విషయాలు..

తిరుమల పింక్ డైమండ్ పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్‌ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


2019 ఎన్నికల సమయం లోనూ ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. కాగా , ఈ డైమండ్ పై ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేసింది. అది పింక్ డైమాండ్ కాదని.. కేవలం కెంపు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.

తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్‌ డైమండ్‌ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తేల్చింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్‌ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీంతో, ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్‌(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి కీలక అంశాలను బయట పెట్టారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్‌ డైమండ్‌ కానేకాదని ప్రకటించారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్‌ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు.

కాగా, మైసూరు ప్యాలెస్‌ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్‌ డైమండ్‌ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇక.. ఇటు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తాజాగా ఈవోగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్ కీలక సూచనలు చేసారు. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పని చేయాని సూచించారు. భక్తుల అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. అదేవిధంగా, వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించాలి నిర్దేశించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.