మార్కెట్లో ఆలివ్ నూనె నుండి బియ్యం ఊక వరకు అనేక రకాల నూనెలు లభ్యమవుతున్నాయి. అయితే భారతీయ ఇళ్లలో వంటల్లో, ప్రత్యేకించి కొన్ని వంటకాల కోసం తప్పనిసరిగా ఉపయోగించే నూనె ఆవ నూనె .
ఇది కేవలం వంటకాలకు రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి, చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆవ నూనెలో నొప్పి నివారణ లక్షణాలు సహజంగానే ఉండటం వల్ల కీళ్ల నొప్పులు, చెవి నొప్పులు తగ్గుతాయి. పంటి నొప్పి ఉంటే ఆవ నూనెలో ఉప్పు కలిపి చిగుళ్లను మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.
ఆవ నూనె ప్రధాన లాభాలు:
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* చర్మాన్ని తేమగా ఉంచి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
* జుట్టు మూలాలను బలపరచి, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.
* ఆవపిండిలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది.
* జలుబు, దగ్గు, సైనస్ సమస్యల సమయంలో ఆవ నూనెతో ఆవిరి పీల్చడం ఉపకరిస్తుంది.
* కీళ్ల నొప్పులు, శరీర నొప్పుల కోసం మసాజ్‌లో ఉపయోగిస్తారు.
* రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
అంతేకాక, ఆవ నూనెలో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో, చర్మపు మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.
































