వర్షాకాలంలో ఇవి తింటున్నారా..?

ర్షాకాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణంలో జరిగే మార్పులతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కారణాలుగా చెప్తున్నారు వైద్య నిపుణులు.


ఓ వైపు వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉంటే వేడివేడిగా బజ్జీలు,సమోసాలు లేదా ఫ్రైడ్ ఫుడ్ తినాలని అనిపిస్తుంటుంది. కానీ ఈ కాలంలో అవి తినకూడదని.. త్వరగా జీర్ణం కావని నిపుణులు చెబుతున్నారు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. నూనె సంబంధిత పదార్థాలు తీసుకోవడం కారణంగా అవి త్వరగా జీర్ణం కావని, దాని ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు వివరించారు.

అలాగే వర్షాకాలంలో బయటి ఫుడ్ అసలు తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు వెంట ఉండే పానీపూరీ వంటి పదార్థాలు తినడం వల్ల విరేచనాలు, పచ్చ కామెర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే బయట నీరు కూడా తాగొద్దని చెబుతున్నారు. ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసుకున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వివరిస్తున్నారు. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తాజా, వేడి చేసిన ఆహారాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, మొలకలు, బాదంపప్పులు వంటివి తీసుకోవాలి.. నీరు అధికంగా ఉన్న ఆహారాలకు, స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వర్షాకాలంలో చికెన్ , మటన్, సీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. వానాకాలంలో వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే మంచిదంటున్నారు. వర్షాకాలంలో తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని.. ఉడికించిన లేదా బాగా శుభ్రం చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలని చెబుతున్నారు. పసుపు, అల్లం, తులసి, వెల్లుల్లి వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. మిల్లెట్స్, ఓట్స్ వంటి ఆరోగ్యకరమైన ధాన్యాలు తీసుకోవడం మంచిదని వివరిస్తున్నారు. అలాగే ఎప్పుడూ వేడి చేసిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలని చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.