ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసే డబ్బుల్ని విత్‌డ్రా చేసే విషయంలో నియమనిబంధనలు ఉంటాయి. జాబ్ మానేస్తే ఈపీఎఫ్ డబ్బులు మొత్తం విత్‌డ్రా చేయొచ్చా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
మీరు ఎప్పుడైనా మీ పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేశారా? అందులో రెండు పేర్లతో డబ్బులు కనిపిస్తాయి. ఒకటి ఎంప్లాయీ షేర్, ఇంకొకటి ఎంప్లాయర్ షేర్. ఇక్కడ ఎంప్లాయర్ షేర్ అంటే యజమాని కంట్రిబ్యూషన్. 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో ప్రావిడెంట్ ఫండ్‌లో చేరటం తప్పనిసరి. ఇది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ నిర్వహించే పథకం. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వాళ్లకి ఆర్థిక భద్రత ఇవ్వడమే దీని ఉద్దేశం
మీరు ఎప్పుడైనా మీ పీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేశారా? అందులో రెండు పేర్లతో డబ్బులు కనిపిస్తాయి. ఒకటి ఎంప్లాయీ షేర్, ఇంకొకటి ఎంప్లాయర్ షేర్. ఇక్కడ ఎంప్లాయర్ షేర్ అంటే యజమాని కంట్రిబ్యూషన్. 20 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో ప్రావిడెంట్ ఫండ్‌లో చేరటం తప్పనిసరి. ఇది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ నిర్వహించే పథకం. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వాళ్లకి ఆర్థిక భద్రత ఇవ్వడమే దీని ఉద్దేశం.
ఇది ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణతో చూద్దాం. మీరు మీ బేసిక్ జీతం నుంచి 12 శాతం అంటే ఉదాహరణకి రూ.4,000 పీఎఫ్‌కి జమ చేస్తారనుకుందాం. అప్పుడు మీ యజమాని కూడా రూ.4,000 జమ చేయాలి. మొత్తం కలిపి మీ ఖాతాలో రూ.8,000కి అదనంగా ప్రతి ఏడాది వడ్డీ కూడా వస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ 8.25 శాతం వడ్డీ ఇస్తోంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఎంప్లాయర్ జమ చేసే మొత్తం మీ పాస్‌బుక్‌లో పూర్తిగా కనిపించదు. ఎందుకంటే ఆ మొత్తం మొత్తం ఈపీఎఫ్‌లోకే వెళ్లదు. యజమాని కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్‌లోకి వెళ్తుంది. మిగతా 3.67 శాతం మాత్రమే మీ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. మీరు రూ.4,000 జమ చేస్తే, మీ యజమాని కేవలం రూ.1,222 మాత్రమే మీ పీఎఫ్‌లో జమ చేస్తాడు. మిగతా మొత్తాన్ని EPSలోకి మారుస్తారు. వీటన్నీ మీ EPFO మెంబర్ పాస్‌బుక్‌లో చెక్ చేయవచ్చు.
ఇక “ఎంప్లాయర్ షేర్”ని విత్‌డ్రా చేయచ్చా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. నిజానికి కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం. 58 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత యజమాని వాటా సహా మొత్తం డబ్బు తీసుకోవచ్చు. అలాగే మీరు రెండు నెలల పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా మొత్తం విత్‌డ్రా చేయొచ్చు. ఒక నెల నిరుద్యోగం తర్వాత 75 శాతం వరకు తీసుకోవచ్చు. వైద్య చికిత్స, చదువు, పెళ్లి వంటి అవసరాల కోసం డబ్బు తీసుకోవచ్చుగానీ, అప్పుడు ఉద్యోగి జమ చేసిన డబ్బు నుంచే ఇస్తారు. అయితే హౌస్ కొనడం లేదా కట్టించడం కోసం అప్లై చేస్తే ఎంప్లాయర్ షేర్ నుంచీ కొంత డబ్బు పొందొచ్చు.
మీ పీఎఫ్ పాస్‌బుక్‌లో కనిపించే ప్రతి కాలమ్‌కి ఓ ఉద్దేశం ఉంటుంది. ఉద్యోగిగా మీరు ఏం ఎంత జమ చేస్తున్నారో, కంపెనీ ఏమి ఇస్తుందో కచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం. దీని వల్ల మీ భవిష్యత్ ఆర్థిక భద్రతపై మీకే స్పష్టత వస్తుంది. మీరు పీఎఫ్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, అంత ఎక్కువ ప్రయోజనం పొందగలరు. ఇకనైనా మీ పాస్‌బుక్ ఓసారి ఓపెన్ చేసి అన్ని వివరాలు చూడండి. భవిష్యత్తుకు సరైన ప్లానింగ్ మొదలుపెట్టండి.
































