స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 65కిమీ మైలేజ్.. రూ.15కే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు

Electric Scooter: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల రివల్యూషన్ నడుస్తోంది. కొత్త కొత్త ఈవీలు రోడ్లపైకి వస్తున్నాయి. పోటీ పడి ధరలను తగ్గిస్తూ, బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మీరు ఈవీ కొనాలి అనుకుంటూ ఉంటే.. దీన్ని ఓసారి పరిశీలించవచ్చు. పూర్తి వివరాలు చూడండి.


ఇది VX2 ఎలక్ట్రిక్ Scooter. 91 ఎలక్ట్రిక్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ఇది 60V 32Ah Lead Acid మోడల్. దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు. ఈ స్కూటర్‌కి 1 కిలోమీటర్‌కి 15 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది. అంటే.. రూ.15కే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అంటే తక్కువ ఖర్చుతో.. ఎక్కువ దూరం వెళ్లేందుకు వీలుంది. స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు

ఈ స్కూటర్‌కి 60V 40Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దీనికి 8 AMP ఆటో కట్ ఆఫ్ ఛార్జర్ ఇస్తున్నారు. ఈ ఛార్జర్‌కి వారంటీ లేదు. బ్యాటరీని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే… 55 కిలోమీటర్లు వెళ్తుంది. అదే ఎకో మోడ్‌లో అయితే 65 కిలోమీటర్లు కూడా వెళ్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చెయ్యడానికి 4-5 గంటలు పడుతుంది. ఈ బ్యాటరీకి 1 సంవత్సరం వారంటీ ఉంది. మరో 3 రకాల బ్యాటరీల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే.. ఇతర బ్యాటరీ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. టాప్ రేంజ్ 65 కిలోమీటర్లుగా ఉంది.

ఈ స్కూటర్ 5 కలర్స్‌లో లభిస్తోంది. అవి బ్లాక్, వైట్, సిల్వర్, బ్లూ, క్రిమ్సన్. దీనికి డిజిటల్ LED స్పీడోమీటర్ ఉంది. 27H BLDC మోటర్ ఉంది. బూట్ స్పేస్ 15 లీటర్లుగా ఉంది. అందువల్ల కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. లోడింగ్ కెపాసిటీ 60 కేజీలు ఉంది. టైర్లకు 1 సంవత్సరం వారంటీ ఉంది. ఐతే, ముందు, వెనక సస్పెన్షన్ లేదు. కానీ హైడ్రాలిక్ షాకర్ ఉంది. LED హెడ్ లైట్, టైల్ లైట్ ఉన్నాయి. బటన్‌తో ఆపరేట్ చేసే ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు.

ఫీచర్లు చూస్తే.. డిజిటల్ స్పీడో మీటర్ ఉంది. కీ ద్వారా ఇగ్నిషన్ ఇవ్వొచ్చు. యాంటీ-థెఫ్ట్ ఆప్షన్ ఉంది. అందువల్ల చోరీ యత్నాలు కుదరకపోవచ్చు. రివర్స్ మోడ్ కూడా ఇచ్చారు. స్మార్ట్ LED డిస్‌ప్లే, హ్యాండీ కప్ హోల్డర్, స్టర్డీ బాడీ, ఇద్దరు కూర్చునేలా కంఫర్ట్ స్పేస్, ప్రొటెక్టివ్ గార్డ్, ఈజీ స్టాండ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ 120 కేజీల బరువును మొయ్యగలదు.

ఈ స్కూటర్ ధర రూ.62,999గా నిర్ణయించారు. ఇందులోనే GST కూడా కలిపి ఉంటుంది. అందువల్ల అదనపు ఖర్చులు లేనట్లే. జీరో కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. రూ.5,000కి పైన ఆర్డర్ చేసేవారికి రూ.500 డిస్కౌంట్‌తోపాటూ.. ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నారు. అందువల్ల బుక్ చేసుకునేవారికి ఇది కొంత రిలీఫ్ ఇస్తుంది.

ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లే కాబట్టి.. దీన్ని కొనుక్కునేవారికి.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. అలాగే.. రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి.. చాలా మనీ ఆదా అవుతుంది. అలాగే.. సిటీలో తక్కువ దూరాలకు వెళ్లేవారికి ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది. అన్నింటికీ మించి.. దీని లుక్ ఆకర్షణీయంగా ఉంది. చాలా ఈవీలు తక్కువ ధర ఉన్నా, అందంగా ఉండవు. ఈ స్కూటర్ లుక్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ స్కూటర్‌ని కొనాలని అనుకుంటే.. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. దీనిపై ముందుగా కంపెనీ ప్రతినిధులు లేదా డీలర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే.. కొనేవారికి చాలా అనుమానాలు ఉంటాయి. వాటన్నింటికీ ఆన్సర్లు పొందిన తర్వాతే కొనుక్కోవాలో, వద్దో నిర్ణయం తీసుకోవాలి. bikes@outdoors91.com కి మెయిల్ పంపి కూడా.. వివరాలు తెలుసుకోవచ్చు. లేదా.. 91 7506753847కి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, వెబ్‌సైట్‌లో సేకరించిన సమాచారం మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.