Paradha OTT: ఓటీటీలోకి అనుపమ కొత్త సినిమా.. ‘పరదా’ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రం ‘పరదా’. భిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరినీ ఆలోచింపచేసింది. ఇప్పుడీ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది (Paradha OTT). అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడన్‌గా అమెజాన్‌లో (Amazon Prime Video) ఈ సినిమా ప్రత్యక్షమైంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో ఇది అందుబాటులోకి వచ్చింది.


క‌థేంటంటే..: పడతి అనే ఓ కల్పితమైన ఊరు నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడ ప్రతి యువతీ పరదా కప్పుకొనే తిరగాలనేది ఆచారం. పరదా తీసినట్టు రుజువైతే మాత్రం గ్రామ దేవత జ్వాలమ్మ ముందు ఆత్మార్పణ చేసుకోవాల్సి ఉంటుంది. అనాదిగా వస్తున్న ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న ఆ ఊరి యువతి సుబ్బు (అనుపమ పరమేశ్వరన్) ఊహించని రీతిలో చిక్కుల్లో పడుతుంది. పరదా లేని ఆమె ఫొటో బయటకి రావడమే అందుకు కారణం. ఒక పక్క తాను మనసిచ్చిన రాజేశ్ (రాగ్ మయూర్)తో నిశ్చితార్థానికి సిద్ధం అవుతుండగానే ఇదంతా జరుగుతుంది. సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం ధర్మశాలకి పయనం కావాల్సివస్తుంది. ఆ ప్రయాణం ఎలా సాగింది? తనకి తోడుగా నిలిచిన రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) ఎవరు? ఇంతకీ పరదా లేని సుబ్బు ఫొటో ఎలా బయటికొచ్చింది? పడతి అనే ఊరు అనుసరిస్తున్న కఠినమైన ఆ కట్టుబాటు వెనక చరిత్ర ఏమిటి? సుబ్బు తాను తప్పు చేయలేదని నిరూపించుకుందా లేదా?అనేదే పరదా సినిమా.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.