కొత్త ప్రయాణం మొదలు పెట్టిన జగపతి?

సీనియర్ నటుడు జగపతిబాబు తన రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుసగా వినూత్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.


ఇటీవల టాక్ షో హోస్ట్‌గా కూడా మారి మరోవైపు తన ప్రతిభను చూపించారు. ఇక ఇప్పుడు ఆయన కెరీర్‌లో మరో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో హీరో తండ్రి పాత్రలో కనిపించిన రాజీవ్ కనకాల స్థానంలో అసలు జగపతిబాబు ఉండాల్సింది. దర్శకుడు సాయి మార్తాండ్ మొదట ఆ పాత్ర కోసం జగపతిబాబునే సంప్రదించినా, కొన్ని కారణాల వల్ల ఆయన ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా ఘన విజయం సాధించడంతో, ఆ పాత్రను వదులుకోవడం తన జీవితంలో చేసిన తప్పుల్లో ఒకటని జగపతిబాబు భావిస్తున్నారట. దీంతో ఆయన కొత్త నిర్ణయం తీసుకున్నారు. తొలిసారి నిర్మాతగా మారి, సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఒక సినిమాను తానే నిర్మించబోతున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. “నీతో మరో సినిమా చేస్తాను. ఆ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తాను” అని మార్తాండ్‌కు స్వయంగా చెప్పారట జగపతిబాబు. ఇప్పుడు జగపతిబాబు ప్రొడ్యూసర్‌గా చేయబోయే ఈ ప్రాజెక్ట్‌ ఎలా ఉండబోతోంది? ఎలాంటి కథతో వస్తుంది? అన్నదానిపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.