రైల్వే బిగ్ అలర్ట్- ఆ 4 వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్ మార్పు

తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రయాణించే నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్స్ లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేస్తోంది. ఇందులో కాచిగూడ-యశ్వంత్ పూర్ మధ్య ప్రయాణించే రెండు వందే భారత్ రైళ్లతో పాటు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి.


వీటి సమయాల్లో మార్పులకు సంబంధించి ఇవాళ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ కొన్నింటిలో ఎక్కువగా ఉంటుండగా.. మరికొన్నింట్లో తక్కువగా ఉంటోంది. దీంతో షెడ్యూల్స్ ను మార్చడం ద్వారా దీన్ని సరిదిద్దేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్ కు వెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20703తో పాటు యశ్వంత్ పూర్ నుంచి కాచిగూడకు ప్రయాణించే రైలు నంబర్ 20704 ప్రస్తుతం బుధవారం మినహా వారంలో మిగిలిన రోజులన్నీ ప్రయాణిస్తుండగా.. ఇప్పుడు వీటిని శుక్రవారం మినహా వారంలో మిగిలిన రోజులు ప్రయాణించేలా మారుస్తున్నారు.

అలాగే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ప్రయాణించే వందే భారత్ రైలు నంబర్ 20707తో పాటు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణించే వందే భారత్ రైలు నంబర్ 20708 రైలు కూడా ప్రస్తుతం గురువారం మినహా మిగిలిన రోజుల్లో రాకపోకలు సాగిస్తుండగా… ఇప్పుడు వీటిని సోమవారం మినహా మిగిలిన రోజుల్లో ప్రయాణించేలా మార్పులు చేస్తున్నారు. అయితే కాచిగూడ-యశ్వంత్ పూర్ రైళ్ల మార్పులు డిసెంబర్ 4 నుంచి, సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైళ్ల మార్పులు డిసెంబర్ 5 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. రైల్వే బోర్డు ఈ మార్పుల్ని ఆమోదించినట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల అధికారి శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ రైళ్ల టైమింగ్స్, హాల్ట్ లలో మాత్రం ఏమార్పూ లేదన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.