కలబంద ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర సమస్యలు అదేనండీ డయాబెటీస్ ఉన్నవారు కలబందను తీసుకుంటే రక్తంలో చక్కెర సమస్య తగ్గుతుంది.
కలబంద ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కలబంద అనేక చర్మ సమస్యలకు తేలిగ్గా చికిత్స అందించవచ్చు. అందువల్ల వీలైనప్పుడల్లా కలబందను వినియోగించాలని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా ముఖం మీద మొటిమల సమస్య ఉంటే, ప్రతిరోజూ కలబందతో పసుపు కలిపి రాసుకోవాలి. ఇది మొటిమల సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.
పసుపును కలబందతో కలిపి ముఖానికి పూయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటుంది. ఇది అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. దీనితో పాటు, కలబందను ముఖానికి పూయడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా ఉంటుంది. జుట్టు రాలడం సమస్య ఉంటే, తలకు కలబంద క్రీమ్‌ను అప్లై చేయవచ్చు.
































