సంతోషమైనా.. దుఃఖమైనా.. నలుగురితో పంచుకోవాలని అంటారు. ఎందుకంటే సంతోషం నలుగురితో పంచుకుంటే రెట్టింపు అవుతుంది.. బాధను ఇంకొకరికి చెప్తే తగ్గిపోతుంది.
అలా ఏ విషయాన్ని అయినా చెప్పాలని కొందరు చెబుతూ ఉంటారు. కానీ ఇది అన్ని సందర్భంలో కాదు. కొన్ని విషయాలను ఎట్టి పరిస్థితుల్లో పక్క వారికి చెప్పుకోకూడదు. ముఖ్యంగా ఈ ఐదు విషయాలను కనుక ఇతరులకు చెబితే జీవితంలో సగం ఓడిపోతారు. మిగతా సగం ఆ తర్వాత జరిగే పరిణామాలు ఓడగోడుతాయి. మరి ఇతరులకు చెప్పని ఆ రహస్యాలు ఏంటి? ఒకవేళ చెబితే ఏం జరుగుతుంది?
డబ్బులు లేవు:
డబ్బులు అందరి వద్ద ఒకేలా ఉండవు. అలా ఉండాలని రూల్ ఏం లేదు. అయితే ఒక్కోసారి నిజం కూడా చేదుగా మారుతుందని అంటారు. మన దగ్గర డబ్బులు లేవన్న విషయం ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు. డబ్బులు లేనివారిని లోకం చులకనగా చూస్తుంది. దీంతో సమాజంలో గుర్తింపు కోల్పోయి మిగతావారు కలిసిమెలిసి ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల ఒకవేళ డబ్బులు లేకున్నా ఏదోలా మేనేజ్ చేయాలి. లేదా కొన్నిటికి పరోక్షంగా దూరంగా ఉండాలి. అంతేకానీ డబ్బులు లేవని ఎప్పుడూ చెప్పుకోవద్దు.
ఫ్యామిలీ గొడవలు:
ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ విషయాలను ఇతరులకు చెప్పద్దు. ఒక్కోసారి భార్యాభర్తల మధ్య జరిగే విషయాలను తమ స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల వారి రహస్యాలు బయటపడి.. చెప్పేవారికి విలువ లేకుండా పోతుంది. ఇంట్లో సమస్యలను తాను పరిష్కరించలేకపోతున్నారని చెప్పడం వల్ల.. బయట కూడా విలువ ఉండే అవకాశం ఉండదు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన విషయాలను స్నేహితులతో అసలు పంచుకోకూడదు..
బాధలు అందరికీ చెప్పుకోవద్దు:
కష్టం వచ్చినప్పుడు నలుగురికి చెబితే.. భారం తగ్గుతుంది అంటారు. అయితే ఆ నలుగురు మంచివారే ఉంటే పర్వాలేదు.. కానీ కొందరు బాధను కామెడీగా చేసి.. హేళన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నీ బాధను అడ్డం పెట్టుకొని చెడుగా ప్రచారం చేస్తారు. అందువల్ల అందరితో కాకుండా దగ్గరి వారితో మాత్రమే షేర్ చేసుకునే ప్రయత్నం చేయాలి. తెలియని వారితో తమ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేయొద్దు.
లక్ష్యం గురించి..
జీవితంలో ఒక స్థాయికి రావాలని అందరూ కోరుకుంటారు. కొంతమంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇలా చేరుకునేవారు తమ లక్ష్యం గురించి ఇతరులకు చెప్పుకోరు. ఎందుకంటే తాము చేసే పని గురించి ఇతరులకు చెప్పడం వల్ల.. వారు కాపీ కొడతారు. లేదా మీరు ఎదిగేకొద్దీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందువల్ల జీవితంలో ఏం చేసేది? ఎలా బతికే ది? అనే విషయం ఇతరులకు అస్సలు చెప్పకుండా ఉండాలి.
డబ్బులు ఉన్నాయని చెప్పొద్దు:
డబ్బులు లేవని చెప్పడం ఒక రకమైన మైనస్ అయితే.. ఉన్నాయని చెప్పడం మరో రకమైన సమస్యగా మారుతుంది. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్న విషయం నలుగురికి చెప్పడం వల్ల.. పదేపదే అప్పు అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజుల్లో డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుకోవడం మంచిది.
































