నడుము సైజు ఈ నంబర్ దాటిందా?.. డయాబెటిస్, బీపీ, క్యాన్సర్ క్యూ కడతాయి.

డుము చుట్టూ కొవ్వు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని సూచిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, మీ నడుము సైజు ఒక నిర్దిష్ట పరిమితిని దాటితే మీకు కనిపించని ప్రమాదాలు ఉంటాయి.


నడుము సైజు, ఆరోగ్య సమస్యల మధ్య ఉన్న సంబంధం గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నడుము సైజు ఎందుకు ముఖ్యమో తెలుసా?

డాక్టర్ కులకర్ణి ప్రకారం, నడుము సైజులో అంతర్గత ఆరోగ్య ప్రమాదాలను సూచించే ఒక ముఖ్యమైన సూచిక ఉంది. “మీ నడుము చుట్టూ కొవ్వు 34 అంగుళాలు దాటితే, దాన్ని మీరు క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఈ స్థాయి దాటితే జీవనశైలి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. నడుము సైజు 34 అంగుళాలు దాటితే అది లివర్, ప్యాంక్రియాస్ వంటి కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుందని సూచిస్తుంది” అని ఆయన చెప్పారు.

కొవ్వు పెరుగుదలకు కారణం ఇదే

మనిషి శరీరం చాలా కాలం పాటు ఉపవాసం ఉండటానికి, శక్తిని నిల్వ చేసుకోవడానికి తగ్గట్టుగా అభివృద్ధి చెందింది. కానీ ఈ రోజుల్లో మనం దాదాపు నిరంతరం తింటూనే ఉన్నాం. నడుము చుట్టూ కొవ్వు పెరగడం అంటే శరీరం అవసరానికి మించి కొవ్వును నిల్వ చేసుకుంటుందని స్పష్టమైన సంకేతం.

మెటబాలిజం దెబ్బతింటే, డయాబెటిస్, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన జన్యువులు చురుకుగా మారతాయని డాక్టర్ భాగ్యేష్ హెచ్చరించారు. “ఇలా జరిగినప్పుడు, ఆ నిశ్శబ్ద ప్రమాదాలు ప్రేరేపితమై, కాలక్రమేణా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి” అని ఆయన చెప్పారు.

గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. వీటిని నిపుణుల వైద్య సలహాగా భావించవద్దు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.