రాత్రి పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి పెరుగు తినడం వల్ల శరీరం చల్లగా మారుతుంది.
దీంతో నిద్ర సరిగా పట్టదు. నిద్రలేమి సమస్య వస్తుంది. రాత్రిపూట శరీరంలో జీవక్రియ కార్యకలాపాలు మందగిస్తాయి. పెరుగు వంటి భారీ శీతలీకరణ ఆహారాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫం పెరుగుతుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. రాత్రిళ్లు పెరుగు తింటే గొంతు బిగిసిపోవడం, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
రాత్రిపూట పెరుగు తినడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది ముఖ్యంగా పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి రాత్రిపూట పెరుగు తిన్న తర్వాత చర్మ అలెర్జీలు, మొటిమలు లేదా దురదలు ఎదురవుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తిన్న తర్వాత కీళ్ల నొప్పులు పెరగవచ్చు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలను విస్మరించవద్దు. మంచి ఆరోగ్యం కోసం మీ ఆహారంలో సమతుల్యతను కాపాడుకోండి.
రాత్రిళ్లు పెరుగు తినడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిన్నర్ సమయంలో పెరుగు తినకూడదు. రాత్రిళ్లు పెరుగు తినడం వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. నీరసంగా అనిపించడంతో ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రి పెరుగు తింటే ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు తినకుండా ఉండడం మంచిది. రాత్రిపూట పెరుగు తింటే శరీరంలో తేమ పెరిగి చర్మంపై ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఎలెర్జీకి కారణమవుతుంది.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
































