అభ్యర్థులకు తీపి కబురు.. మెగా DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల

అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌ను విద్యా శాఖ అధికారులు ఎట్టకేలకు విడుదల చేశారు.


ఈ మేరకు తుది ఎంపిక జాబితాను జిల్లా విద్యాధికారి, కలెక్టర్‌ కార్యాలయాలు, మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌https://apdsc.apcfss.in/లో పొందుపరిచారు. మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్‌ 20న ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులను సమర్పించగా.. జూన్‌ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించి జులై 5న ప్రైమరీ కీ విడుదల చేయగా.. ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేశారు. అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవ్వడంతో తాజాగా మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌ను విడుదల చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.