ఐటీఆర్ ఫైలింగ్‌ కు నేడే చివరి అవకాశం.. ట్యాక్స్ పేయర్స్ కు కేంద్రం బిగ్ అలర్ట్

న్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR ఫైలింగ్) దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ (సెప్టెంబర్ 15, 2025). గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.


రూ. 5000 వరకు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే, గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు చేసేందుకు గడవు పొడిగించలేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ‘ఐటీఆర్‌ (IT Returns) ఫైలింగ్‌ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించామని తెలిపింది.

కానీ, ఆ తేదీని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదని ఐటీఆర్‌ దాఖలుకు సెప్టెంబరు 15 చివరి తేదీ అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను (Income Tax) విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. ఐటీఆర్‌ ఫైలింగ్‌ (ITR Filing), పన్ను చెల్లింపులపై సందేహాలను నివృత్తి చేసేందుకు రౌండ్ ది క్లాక్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామంటూ ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయడం అవసరం. పన్ను చెల్లింపుదారుడు దానిని మిస్ చేస్తే, నిబంధనల ప్రకారం, జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, గడువు తర్వాత రిటర్న్‌లను దాఖలు చేసినందుకు పన్ను చెల్లింపుదారులపై జరిమానా విధించే నిబంధన ఉంది. ఇది గరిష్టంగా రూ. 5000 వరకు ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసినందుకు రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.1,000 జరిమానా విధించబడుతుంది.

ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం కారణంగా, జరిమానాను ఎదుర్కోవడమే కాకుండా, అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఉదాహరణకు, పన్ను చెల్లించాల్సి ఉంటే, సెక్షన్ 234A ప్రకారం బకాయి ఉన్న మొత్తానికి 1% నెలవారీ వడ్డీని చెల్లించడం తప్పనిసరి. దీనితో పాటు, నిర్ణీత గడువు తర్వాత దాఖలు చేసిన రిటర్న్‌ల ప్రాసెసింగ్ సాధారణంగా చాలా సమయం పడుతుంది, దీని కారణంగా తమ వాపసు పొందాలని ఆశించే పన్ను చెల్లింపుదారులు జాప్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.