నెలనెలా కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ లక్షల్లో ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే యస్ బీఐ అందిస్తున్న ఈ ఆర్ డీ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో ఎలా పొదుపు చేయాలి? ఎంత పొదుపు చేస్తే ఎంత వస్తుంది? వంటి పూర్తి వివరాలు..
ప్రతి నెలా కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయం పొందాలనుకుంటున్నారా? అయితే రికరింగ్ డిపాజిట్(ఆర్ డి) స్కీమ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. నెలవారీగా పొదుపు చేస్తూ తక్కువ టైంలో లక్షాధికారి అయ్యేందుకు ఈ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్. మరి ప్రస్తుతం అలాంటి స్కీమ్స్ లో బెస్ట్ ఏది? నెల నెలా ఎంత పొదుపు చేయాలి? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆర్ డీ స్కీమ్స్ లో యస్ బీఐ లఖ్ పత్ ఆర్ డీ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా ప్రతినెలా కొంత చొప్పున డిపాజిట్ చేసి ఒకేసారి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందొచ్చు. నెలవారీ ఆదాయం ఉన్న వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పైగా, ఈ డిపాజిట్‌పై బ్యాంక్ ఆకర్షణీయమైన వడ్డీ కూడా పొందొచ్చు.
వడ్డీ వివరాలు
యస్ బీఐ హర్ ఘర్ లఖ్పతి స్కీమ్ మెచ్యురీటీ పీరియడ్ ని ఏడాది నుంచి పదేళ్ల మధ్య ఎంచుకోవచ్చు. స్కీమ్ వ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఈ స్కీమ్ లో జనరల్ కస్టమర్లకు 6.55 శాత సీనియర్ సిటిజన్లకు 7.05శాతం వరకువడ్డీ అందుతుంది.
ఉదాహరణకు మీ గోల్ 8.25 లక్షలు అయితే నెలకు రూ. 11,682 చొప్పున ఐదేళ్ల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేదా నెలకు రూ.15,010 చొప్పున నాలుగేళ్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మీరు సీనియర్ సిటిజన్ అయితే నెలకు రూ. 11,529 చొప్పున ఐదేళ్ల పాటు డిపాజిట్ చేయాలి. లేదా రూ. 14,853 చొప్పున నాలుగేళ్ల పాటు డిపాజిట్ చేయాలి.
తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునేవాళ్లు నెలకు రూ.1500 చొప్పున డిపాజిట్ చేయడం ద్వారా ఐదేళ్లకు చేతికి రూ.1 లక్ష వస్తాయి.
ఎలిజిబిలిటీ
ఈ స్కీమ్ కు పదేళ్లు పైబడిన వారందరూ అర్హులే. యస్బీఐ బ్రాంచ్‌లో లేదా ఆన్ లైన్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. తక్కువ ఇన్వెస్ట్ మెంట్స్ ఆప్షన్స్ తో ఎక్కువ మొత్తం పొందే బెస్ట్ స్కీమ్స్ లో ఇదొకటి. సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్ మెంట్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
































