మారుతీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. చిన్నకార్లపై భారీ డిస్కౌంట్స్‌.. కేవలం రూ.3.87 లక్షలకే..

తమ వినియోగదారులకు మారుతీ సుజీకి సంస్థ అదిరిపోయే గుడ్‌ న్యూస్ చెప్పింది. పండగ సీజన్‌కు ముందు కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి బంఫర్‌ ఆఫర్ ఇచ్చింది. దేశంలో తాజాగా తగ్గిన జీఎస్టీ ధరల నేపథ్యంలో తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్టు సంస్థ పేర్కింది. ఈ ఆఫర్స్‌తో మారుతీ సుజూకీలోని చాలా మోడల్స్‌ తక్కువ ధరకే రానున్నాయి.

తమ వినియోగదారులకు మారుతీ సుజీకి సంస్థ అదిరిపోయే గుడ్‌ న్యూస్ చెప్పింది. పండగ సీజన్‌కు ముందు కొత్త కారు కొనాలని చూస్తున్న వారికి బంఫర్‌ ఆఫర్ ఇచ్చింది. దేశంలో తాజాగా తగ్గిన జీఎస్టీ ధరల నేపథ్యంలో తమ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్టు సంస్థ పేర్కింది. ఈ ఆఫర్స్‌లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఏకంగా రూ.లక్షకు పైగా తగ్గిస్తున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.


షిఫ్ట్‌ మోడర్‌పై భారీగా డిస్కౌంట్ ఇచ్చిన మారుతీ సంస్థ

  • షిఫ్ట్‌ లవర్స్‌కు మారుతీ సుజూకీ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది
  • తాజాగా ప్రకటించిన ఆఫర్స్‌తో స్విఫ్ట్ మోడల్‌ ధర అత్యధికంగా రూ. 1.06 లక్షల వరకు తగ్గనున్నట్టు తెలుస్తోంది.
  • ఈ మోడల్‌ మొదటి వేరియంట్‌పై కూడా సంస్థ రూ. 55,000 వరకు తగ్గించింది
  • ఈ ఆఫర్స్‌ తర్వాత ఎక్స్‌షోరూమ్ షిఫ్ట్‌ కారు రూ. 5.94 లక్షలకే లభించనుంది

మారుతీలోని వివిధ మోడల్‌ కార్ల ఆఫర్స్‌ చూసుకుంటే..

  • మారుతీ సుజుకీ ఆల్టో కే10 మోడల్‌పై రూ. 28,000 నుంచి 53,000 వరకు తగ్గనుంది
  • ఈ ఆఫర్‌తో ఆల్టో కే10 రూ. 3.87 లక్షలకే కస్టమర్లకు లభించనుంది
  • అలాగే ఎస్-ప్రెస్సో మోడల్‌పై రూ. 53,000 వరకు తగ్గనుంది. దీంతో ఈ కారు రూ. 3.90 లక్షలుకే లభించనుంది.
  • ఇక మారుతీ వ్యాగనార్‌పై రూ. 64,000 వరకు డిస్కౌంట్ లభించనుంది
  • అలాగే స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియోపై రూ. 63,000 వరకు తగ్గింపు లభించనుంది
  • ఇక డిజైర్ మోడల్‌పై గరిష్ఠంగా రూ. 87,000 వరకు తగ్గింపు అందుబాటులోకి రానుంది

జీఎస్టీ 2.0 సంస్కరణల నేపథ్యంలో మారుతీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్య తరగతి ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరనుంది. అలాగే కంపెనీ తాజా నిర్ణయంతో మారుతీ సంస్థ అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్స్‌పై మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీకు దగ్గర్లో ఉన్న మారుతీ షోరూంకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.