బీఎండబ్ల్యూ నుంచి రేసింగ్ బైక్ ఎస్ 1000 ఆర్ రిలీజైనంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.రూ. 19.90 లక్షలు. ఇది 999సీసీ, లిక్విడ్-కూల్డ్, నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 170 బీహెచ్ పీ హార్స్ పవర్, 114 ఎన్ ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.
ఫీచర్లివే..
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ బైక్‌లో డేటైమ్ రైడింగ్ లైట్లు, క్విక్ యాక్షన్ థ్రాటిల్, ఏబీఎస్(ABS) ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లున్నాయి. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన 6.5-అంగుళాల టీఎఫ్ టీ (TFT) డిస్‌ప్లే ఉంటుంది. బీఎండబ్ల్యూ యాప్ ద్వారా టర్న్ -బై -టర్న్ నావిగేషన్ పొందొచ్చు. రెయిన్, రోడ్, డైనమిక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అలాగే ఈ బైక్‌లో బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ , సీటు కింద ఉన్న యూఎస్ బీ టైప్ సీ ఛార్జర్ ఉన్నాయి. . ఈ బైక్ బరువు199 కిలోగ్రాముల ఉంటుంది. సీట్ హైట్ 830ఎంఎం, వీల్ బేస్1,447ఎంఎం ఉంటుంది. ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ 16.5 లీటర్లు.
డిజైన్..
ఈ బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఇది నేక్డ్ రోడ్‌స్టర్ డిజైన్ తో ఉంటుంది. వేగంగా దూసుకెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్ ఉంటాయి. ముందుభాగం హెవీగా వెనుక భాగం పొట్టిగా ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి . బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, బ్లూఫైర్ ఎల్లో, లైట్‌వైట్ వంటి కలర్స్ లో వస్తుందిఇండియాలో ఈ బైక్ మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది. దీన్ని ఐదు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా 24×7 రోడ్‌సైడ్ సహాయం ఉంటుంది.
































