ఆధార్‌ కార్డు పోయిందా.. టెన్షన్ అక్కర్లేదు.. ఒక్క క్లిక్‌తో ఇలా చేస్తే చాలు.

ధార్ కార్డు ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికీ ఇది అవసరం. ఒకవేళ మీ ఆధార్ కార్డు పోతే, దానిని దుర్వినియోగం చేస్తారేమోనని భయపడాల్సిన అవసరం లేదు.


UIDAI సంస్థ మీ ఆధార్‌ను లాక్, అన్‌లాక్ చేసే సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఫీచర్‌తో మీరు మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ఆధార్ లాక్ అంటే ఏమిటి?

మీరు మీ ఆధార్‌ను లాక్ చేస్తే, మీ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఎవరూ ఎలాంటి ధృవీకరణ చేయలేరు. అంటే బయోమెట్రిక్, ఓటీపీ లేదా ఇతర వివరాలతో ఎవరూ మీ ఆధార్‌ను ఉపయోగించలేరు. ఒకసారి లాక్ చేస్తే, మీ ఆధార్‌ను మీరు తప్ప ఇంకెవరూ వాడలేరు. తర్వాత ఎప్పుడైనా మీకు అవసరం వస్తే దానిని సులభంగా అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఆధార్‌ను ఆన్‌లైన్‌లో లాక్ చేయడం ఎలా..?

మీరు మీ ఆధార్ కార్డును మూడు రకాలుగా లాక్ చేయవచ్చు.. UIDAI వెబ్‌సైట్, mAadhaar యాప్ లేదా SMS.

వెబ్‌సైట్ ద్వారా లాక్ చేసే విధానం:

ముందుగా UIDAI వెబ్‌సైట్ (uidai.gov.in) కి వెళ్లండి.

‘My Aadhaar’ విభాగంలోకి వెళ్లి Aadhaar Services పై క్లిక్ చేయండి.

అందులో Lock/Unlock Aadhaar అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఇప్పుడు Lock UID పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్, పేరు, PIN కోడ్ వివరాలు నమోదు చేయండి.

క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. Send OTP పై క్లిక్ చేయండి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి, ప్రక్రియను పూర్తి చేయండి.

ఆధార్‌ను ఎలా అన్‌లాక్ చేయాలి..?

మీరు మీ ఆధార్ కార్డును లాక్ చేసిన తర్వాత తిరిగి అన్‌లాక్ చేయాలంటే.. మీకు 16-అంకెల వర్చువల్ ఐడీ అవసరం. లాక్ చేసిన తర్వాత మీ మొబైల్‌కు ఈ VID వస్తుంది.

UIDAI వెబ్‌సైట్‌లో My Aadhaar ట్యాబ్‌లోకి వెళ్లి Lock/Unlock Aadhaar ను ఎంచుకోండి.

ఇప్పుడు Unlock UID పై క్లిక్ చేయండి.

మీ 16-అంకెల వర్చువల్ ఐడీ (VID)ని నమోదు చేసి, ‘Send OTP’ పై క్లిక్ చేయండి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేయడం ద్వారా మీ ఆధార్ అన్‌లాక్ అవుతుంది.

ఈ ఫీచర్ ద్వారా మీ ఆధార్ భద్రతపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్తులో మీ ఆధార్ పోయినా భయపడాల్సిన పనిలేదు. వెంటనే లాక్ చేసి, సురక్షితంగా ఉండండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.