వారి ఖాతాలో రూ.15వేలు.. కేంద్రం గిఫ్ట్.. మిస్ చేసుకోవద్దు!

దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. అయితే ఈ సంవత్సరం సరిగ్గా నెల రోజుల క్రితం కేంద్రం తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన యువత ఉపాధిని పెంచేందుకు స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటించారు ఈ పథకం ద్వారా యువతకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి సంకల్పించారు.


లక్ష కోట్ల వ్యయంతో వారికి భారీ పథకం

దాదాపు లక్ష కోట్ల ఆర్థిక వ్యయంతో 3.5 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీని ద్వారా భారీ ఉపాధి కల్పనకు మద్దతు ఇవ్వనున్నారు. స్వతంత్ర భారత్ నుండి సమృద్ధి భారత వరకు పయనం సాగించేలా యువత ఉపాధిని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు నరేంద్ర మోడీ.

కొత్త ఉద్యోగులకు, ఉద్యోగాలిచ్చిన యజమానికి ప్రోత్సాహకాలు

ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాలలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టికి మద్దతు ఇవ్వడంతో పాటు కొత్తగా ఉద్యోగం చేస్తున్న యువతకు రెండు విడతలుగా 15 వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు. నూతన ఉద్యోగాలు సృష్టించడానికి యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి నెలకు మూడు వేల రూపాయల వరకు ప్రోత్సాహకాలను అందించనున్నారు.

ఈ పథకం ద్వారా యువతకు 15 వేలు

అయితే ఈ పథకం ద్వారా 15 వేల రూపాయలు పొందాలనుకునే కొత్త ఉద్యోగులు మొదటిసారి ఈపీఎఫ్ఓ నమోదు చేసుకుని ఉండాలి. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులకు, మొదటిసారి ఈపీఎఫ్ఓ లో నమోదు చేసుకుని ఉన్న కొత్త ఉద్యోగులకు ఆరు నెలల తర్వాత మొదటి విడతగా 7,500 రూపాయలు, సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత మరో 7,500 రూపాయలు మొత్తం 15 వేల రూపాయలు చెల్లిస్తారు.

యువతలో పొదుపు నేర్పేందుకు ప్రోత్సాహకాలు

యువతలో పొదుపు అలవాటును ప్రోత్సహించడానికి ప్రోత్సాహకంగా కొంత భాగాన్ని డిపాజిట్ ఖాతాలోని సేవింగ్స్ అకౌంట్ లో నిర్ణీత కాలానికి ఉంచుతారు. తర్వాత ఉద్యోగి దానిని ఉపసంహరించుకోవచ్చు. కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

యజమానులకు ప్రోత్సాహకాలు

అంతేకాదు యజమానులకు కూడా ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం కనీసం ఆరు నెలల పాటు కొనసాగే ప్రతి అదనపు ఉద్యోగానికి ప్రభుత్వం యజమానులకు నెలకు 3000 రూపాయల వరకు రెండేళ్లపాటు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తయారీ రంగానికి అయితే ప్రోత్సాహకాలు మూడు నాలుగు సంవత్సరాలు వరకు విస్తరించబడతాయి.

దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా కేంద్ర పథకం

దీని ద్వారా దాదాపు 2.60 కోట్ల మందికి అదనపు ఉపాధి కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది. అయితే ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా ఖాతాలలో నేరుగా జమ చేస్తారు. దీని ద్వారా కోట్లాదిమంది యువతకు, దేశ శ్రామిక శక్తికి వెన్నుదన్నుగా నిలవడం కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.