మాల్దీవ్స్ మునిగిపోతోంది.. భవిష్యత్ లో ఈ దేశం ఇక ఉండదు.

భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు.


భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు?

సాధారణంగా ప్రపంచంలో ఉన్న దేశాలు సముద్రమట్టానికి 840 మీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ మాల్దీవులు మాత్రం 1.5 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్న ప్రకారం 2060 లేదా 2080 సంవత్సరానికి మాల్దీవులు 90 శాతం సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం మాల్దీవులు దేశంలో బోర్వెల్ వేస్తే ఉప్పునీరు బయటకు వస్తుంది. సముద్రపు నీరు పెరుగుతున్న కొద్దీ భూమిలోకి ఉప్పునీరు కలిసిపోతుంది. దీంతో ఇవి తాగడానికి ఏమాత్రం పనికిరావు. వాతావరణ కాలుష్యం.. గ్లోబలైజేషన్ కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి మంచుకొండలు కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టం మెల్లమెల్లగా పెరుగుతుంది. ఇలా మరో 50 ఏళ్ల వరకు మరింతగా పెరిగి మాల్దీవులు దేశం సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది.

అయితే మాల్దీవులు దేశం సముద్రమట్టంలో కలిస్తే ఆ తర్వాత ఇక్కడి ప్రజలు ఏ దేశానికి వలస వెళ్తారు? అన్న చర్చ సాగుతోంది. మాల్దీవులు దేశంలో ఎక్కువగా ముస్లింలు ఉంటారు. అందువల్ల కొందరు ఇస్లామిక్ దేశానికి వలస వెళ్తున్నారని అంటుండగా.. మరికొందరు మాత్రం ఈ దేశానికి భారత్ చేయూతను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఆసియాలో చాలా దేశాలకు ఇప్పటికే భారత్ ఎన్నో రకాలుగా సహాయంగా నిలుస్తోంది. దక్షిణాన ఉన్న శ్రీలంకలో సంక్షోభం ఏర్పడితే ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని నెలల కిందట భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవులు ప్రభుత్వంలోని కొందరు మంత్రులు వ్యతిరేక వాక్యలు చేశారు. భారత్తో తమకు ఎలాంటి అవసరం ఉండదని అన్నారు. కానీ ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షదీప్ వెళ్లడంతో.. భారత్ నుంచి పర్యాటకల సంఖ్య విపరీతంగా తగ్గింది. అంతేకాకుండా కొన్ని రకాల వస్తువుల ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. దీంతో మాల్దీవులు దేశ ప్రధానమంత్రి… నరేంద్ర మోడీ కాళ్ళ బేరానికి వచ్చిన విషయం తెలిసిందే.

మరి భవిష్యత్తులో మాల్దీవులు సముద్ర గర్భంలో కలిసిపోతే అక్కడి ప్రజలు భారత్కు వచ్చే అవకాశం ఉందా? లేదా ఇక్కడి ప్రభుత్వం ఏ దేశంతో చేతులు కలుపుతుంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.