ఉద్యోగులకు దీపావళి బోనస్..పండగ ముందే పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త

ప్రావిడెంట్ ఫండ్ (PF) సభ్యులకు దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సన్నాహాలు చేస్తోంది.


EPFO ​​వెర్షన్ 3.0 ను దీపావళి నుంచి అమలు చేసేందుకు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ఉద్యోగుల EPFOలో చందాదారులగా ఉన్నారు. వీరంతా ఈపీఎఫ్ఓ వెర్షన్ 3.o కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది EPFO ప్రస్తుత వ్యవస్థకు సమూలమార్పునకు కారణం కానుంది. రాబోయే రోజుల్లో ఇకపై ప్రావిడెంట్ ఫండ్ ను పూర్తిగా యూజర్ ఫ్లెండ్లీగా మార్చేందుకు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముఖ్యంగా పీఎఫ్ డబ్బును ఉద్యోగులు సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఇది వీలు కల్పించనుంది.

దీపావళి నుంచి EPFO ​​వెర్షన్ 3.0 విడుదల..
అక్టోబర్ రెండవ వారంలో లేదా దీపావళి లోపు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో EPFO ​​వెర్షన్ 3.o అధికారిక ప్రకటనలో విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దీపావళి పండుగకి ముందే EPFO ​​వెర్షన్ 3.o రానున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు కోట్లాది మంది ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా పనిచేస్తుంది.

EPFO వెర్షన్ 3.0 లో కొత్త ఫీచర్లు ఇవే..
PF సేవలను పొందడంలో ఉద్యోగులకు ఇప్పటికే ఉన్న అనేక ఇబ్బందులను తొలిగించేందుకు కొత్త వ్యవస్థ రానుంది. ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ల కోసం చందాదారులు ఇకపై భారీభారీ దరఖాస్తులు నింపాల్సిన పనిలేదు. ప్రతిసారి ఈపీఎఫ్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని అసలే లేదు. డబ్బు క్లెయిమ్‌ల కోసం ఆటోమేటిక్ పద్ధతిలో క్లెయిమ్స్ ను సెటిల్ చేస్తారు.

డిజిటల్ దిద్దుబాట్లు: పేరు, జెండర్, పుట్టిన తేదీ మొదలైన ఖాతాలో మార్పులను OTP ఆధారిత ధ్రువీకరణ ద్వారా ఆన్‌లైన్‌లో మార్పులకు అవకాశం ఉంది. దీని వల్ల కాగితాలతో పని ఉండదు.

పెన్షన్ ట్రాకింగ్: ఉద్యోగులు తమ పెన్షన్ హక్కులను EPFO ​​డాష్‌బోర్డ్ ద్వారా నేరుగా ట్రాక్ చేయవచ్చు.

UPI, ATM ద్వారా EPF విత్‌డ్రా: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్పులలో ఒకటి UPI డబ్బు బదిలీ, ATM ద్వారా PF విత్‌డ్రాకు అవకాశం ఉండనుంది. ఇది మీ ఖాతాలోని డబ్బును వెంటనే డ్రా చేసేకునేందుకు సదుపాయం
తక్షణమే యాక్సెస్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

కార్మిక, ఉపాధి కార్యదర్శి సుమితా దావ్రా ప్రకారం.. మంత్రిత్వ శాఖ ఇప్పటికే NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) UPI ఇంటిగ్రేషన్ కోసం చేసిన సిఫార్సును ఆమోదించింది. దీని ద్వారా చందాదారులు మే లేదా జూన్ 2025 నుండి వారి బ్యాంకు ఖాతాలలో లేదా ATMల ద్వారా నేరుగా వారి ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపసంహరించుకోగలరు.

GPF, PPF వంటి ఇతర పథకాలకు పైలట్ ప్రాజెక్ట్..
ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద అధికారులు చూసినట్లయితే.. దీన్ని ప్రభుత్వ ఆర్థిక పథకాలకు ఇది వర్తింపజేస్తారని సమాచారం. EPFO వెబ్‌సైట్‌ అప్‌గ్రేడ్‌తో పాటు.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) నిర్వహణ కూడా ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.