ప్రపంచాన్ని ఊపేస్తున్న పవన్‌కల్యాణ్ OG మానియా..ఆస్ట్రేలియాలో 2 నిమిషాల్లే టికెట్లు లేపేశారు!

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ (OG). టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అమానంతం పెరిగిపోవడమే కాకుండా..


సినిమా నుంచి అప్‌డేట్స్ వచ్చే కొద్ది అది మరింత ముదిరిపోతుంది. ఫ్యాన్స్ పిచ్చోళ్లైపోతున్నారు. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఉత్తర అమెరికాలో టికెట్ల సేల్స్ గణనీయంగా పెరగడంతో పాటు సినిమా విడుదలకు 20 రోజుల ముందుగానే 1 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే భారతీయ సినిమాకు ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదో సరికొత్త రికార్డే అని చెప్పొచ్చు. ఈ చిత్రం కోసం ముందస్తు బుకింగ్‌లు మంగళవారం కొన్ని దేశాల్లో విడుదల చేశారు.

అందులో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో (ప్రపంచంలోనే రెండో పెద్ద స్క్రీన్) IMAX స్క్రీన్ టికెట్లన్నీ కేవలం 2 నిమిషాల్లోనే సేల్ అయ్యాయి. ఇది కూడా ఓ సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. అయితే ఓజీ సినిమాకు పవన్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఇంతటి రికార్డు సాధ్యమైంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు మంగళవారం X (గతంలో ట్విట్టర్)లో మెల్‌బోర్న్ ఐమ్యాక్స్ థియేటర్‌కు సంబంధించిన సీటింగ్ ను కొన్ని స్కీన్ షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. టికెట్ బుకింగ్ ప్రారంభమైన 2 నిమిషాల్లో షో మొత్తం అమ్ముడుపోయినట్లు చెప్పుకొచ్చారు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

IMAX మెల్‌బోర్న్‌లో దాదాపు 461 సీట్లు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌లలో ఒకటిగా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమైన ఒక నిమిషం తర్వాత, కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చాలా మంది స్క్రీన్‌షాట్‌లు పంచుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ పవన్ మ్యానియాకు ఇదే నిదర్శనమని ఫ్యాన్స్ అంటున్నారు.

సుజీత్ దర్శకత్వం వహించిన ‘OG’ (ఓజాస్ గంభీర) సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా తెరపై కనిపించనున్నారు. గ్యాంగ్‌స్టర్ కథతో రూపొందిన ఈ చిత్రానికి డీవీవీ పతాకంపై దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 3 సాంగ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. సెప్టెంబరు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.