హైదరాబాద్‌ లో విస్తరిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. తొలి మరణం

హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భాగ్యనగరంలో ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు.


ఇదే వ్యాధితో గత కొన్ని రోజులుగా నిలోఫర్ ఆసుపత్రిలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దీంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని వివరిస్తున్నారు. మరోవైపు ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.

వర్షాకాలంలో భాగ్యనగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. చిన్నపిల్లలే టార్గెట్ గా ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. వ్యాధి తీవ్రత పెరుగుతున్న క్రమంలో నగరంలోని ఆస్పత్రులు నిండిపోతున్నాయి. దాదాపు అన్నీ ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి. నీలోఫర్ ఆస్పత్రిలో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. వ్యాధి విషమించిన చిన్నారులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

అటు ఏపీలోనూ ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. ఈ బ్యాక్టీరియాను చిగ్గర్ లేదా లార్వల్ మైట్ అని పిలవబడే చిన్న పురుగులు మోసుకెళ్తాయి. ఇక ఈ జ్వరం బారిన పడినవారిలో తీవ్రజ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, దగ్గు జలుబు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ల మంట, కోమా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, యాంటీబయాటిక్ చికిత్స ప్రాణాంతక సమస్యలను నివారించడానికి చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.