మీ IRCTC అకౌంట్‌ ఆధార్‌ కార్డ్‌తో లింక్‌ అయిందో లేదో ఇలా తెలుసుకోండి! సింపుల్‌ స్టప్స్‌.

ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్‌ను మరింత పారదర్శకంగా చేయడానికి, అక్రమాలను నివారించడానికి అక్టోబర్ 1, 2025 నుండి IRCTC ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మార్పు వలన టికెట్లను మొదటి 15 నిమిషాల్లో బుక్ చేయడానికి ఆధార్ లింకింగ్ అవసరం.

టికెట్ బుకింగ్‌ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడానికి ఇండియన్‌ రైల్వేస్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 1, 2025 నుండి IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ చేయబడిన వ్యక్తులు మాత్రమే టికెట్ బుకింగ్, మొదటి 15 నిమిషాలకు టిక్కెట్లు బుక్ చేసుకోగలరని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మీ ఐఆర్‌సీటీసీ ఖాతా ఆధార్‌తో లింక్ చేయకుంటే మీరు మొదటి 15 నిమిషాల్లో టికెట్ పొందలేరు. అయితే మీ IRCTC ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒక వేళ కాకుంటే దాన్ని ఎలా లింక్‌ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం..


టికెట్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే చాలా మంది టికెట్ ఏజెంట్లు, కొంతమంది తప్పుడు వినియోగదారులు సీట్లను బ్లాక్ చేయడం జరుగుతోందని రైల్వే శాఖ గుర్తించింది. దీని కారణంగా సాధారణ ప్రయాణీకులు టిక్కెట్లు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను నివారించడానికి, నిజమైన ప్రయాణీకులకు మొదటి అవకాశం ఇవ్వడానికి, ఆధార్ లింక్‌ తప్పనిసరి చేశారు. దీనివల్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, నిజమైన ప్రయాణీకులు ప్రయోజనం పొందుతారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏజెంట్లకు 10 నిమిషాల తర్వాత యాక్సెస్‌ అనేది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది.

IRCTC అకౌంట్‌కి ఆధార్‌ లింక్‌ చెక్‌ చేయండిలా..

  • ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తర్వాత, మై అంకౌట్‌ విభాగానికి వెళ్లండి.
  • అక్కడ మీరు మై ప్రొఫైల్‌కి వెళ్లండి, అక్కడ మీకు ఆధార్ KYC ఎంపిక వస్తుంది.
  • మీ ఆధార్ ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే, అక్కడ KYC వెరిఫైడ్ లేదా ఆధార్ వెరిఫైడ్ అని రాసి ఉంటుంది.
  • ఒకవేళ లింక్ చేయకపోతే ఆధార్ నంబర్‌ను నమోదు చేసే ఆప్షన్ మీకు లభిస్తుంది.

IRCTC ఖాతాతో ఆధార్‌ను ఎలా లింక్ చేయాలంటే?

  • ముందుగా IRCTC వెబ్‌సైట్/యాప్‌లోకి లాగిన్ అవ్వండి.
  • ఆ తర్వాత మై ప్రొఫైల్‌కి వెళ్లి ఆధార్ KYC పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
  • దీని తర్వాత మీ లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్‌ చేయండి.
  • విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మీ ఖాతా ఆధార్‌కు లింక్ అవుతుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.